“ఇకడెవ్వరూ ఎవ్వరిని కలుపుకోలేదు …***య్ బే”

’ సీరియస్ ఎమోషన్ లేకుండా ఫైటింగ్ చెయ్యలేన్రా” – ఇదేనా  రవితేజ డైలాగు? నా పరిస్థితీ అదే. గ్యాప్ వచ్చేసింది. ఎమోషన్ ఎగిరి పోయింది. పైగా మనోహర్‌కి చాన్స్ ఇచ్చినా,  సాలిడ్ పాయింట్లతో రాలేదు.

ఇరానీ కేఫులో చాయ్‍తో  సిగరెట్ కొడుతూ చర్చిస్తే , మనోహర్ లాంటి మిత్రుడు ఒక్క లైన్లో ఇలా చెప్పగలడు :  “ఇకడెవ్వరూ ఎవ్వరిని కలుపుకోలేదు …***య్ బే”

The point is non-assimilation ; not whether i smoke in irani cafes –  I know some guys can’t get it. కలుపుకోవటం అనేది బేసిక్ ప్రిమైజెస్ లో ఒకటి. కాదు పొమ్మంటే ఇక ఏం వాదిద్దాం చెప్పండి. ఐనా , సరదాగా  –  ఇదిగో ఇలా :‌
******************************************************************
“వాడి మతం వాడిది.ఏ మతమైనా చేరాల్సింది పరమపదానికేగా”నన్నది మంఛి ఆలోచన.
– “పరం” గురించి నేను మాట్లాడ లేదు. ఆలోచించలేదు.

ఈ తరం లో ఎవరూ మతం తో విభేదించడం లేదు.
– ’ఈ తరంలో’  అంటూ ఓ తెగ ఫీలవ్వకండి. భూత వర్తమాన భవిష్యత్తులన్నింటిలోనూ విషయం తెలిసిన  వాళ్ళున్నారు. తెలీని వారున్నారు.  ఉంటారు. నాకైతే పాత తరాల్లోనే మీరు చెప్పిన మనుష్యులు  కనబడుతున్నారు. 

టైటిల్ మీరు అందరినీ కలిపి చెప్తున్నారా లేక కేవలం హిందువులకే చెప్తున్నారా అనేది నాకు అర్ధం కాలేదు(క్షమించండి).
– హిందువులనే.  [జస్ట్ ఈ  “హిందువులు”  అన్ని మతాల్లోనూ ఉన్నారులెండి.]

జావేద్ గారికి మీరు చెప్పిందేమిటి?మీకు సనాతన ధర్మంలో ఒక్కడే దేవుడు అని చెప్పలేదా, లేక మీరు గమనించలేదా? ఒక్కడే దేవుడు కాబట్టే ప్రతీదాన్నీ దేవుడి ప్రతిరూపంగా భావించారు. హిందువులు కూడా ఒక్కదేవుడినే పూజించాలని చెప్పారు, కాబట్టి ఒంకొకరిని పూజిస్తే వాళ్ళు హిందువు కాదు అని చెప్పాలా?– నేనూ దేవుడు ఒక్కడే  అని మొదలెట్టాను. మీకు కనపళ్ళేదా? గమనించ లేదా?   నా టపా తప్పు కాదు.  జావేద్‌ గారు చెప్పిందీ మీకు అర్ధం గాలేదు. అందుకనే మీరు అటునుంచి ఇప్పుడే రాకూడదు. మీకు తెలిసిన  basic premise “దేవుడు ఒక్కడే” అయినప్పుడు, వాడిని కోటి పేర్లతో సూచించినప్పుడు, “అల్లా”  అనే శబ్దం కూడా దేవుడినే సూచిస్తున్న కోటిన్నొక్క “హిందూ పేరు”గా భావించ లేకపోతున్నారు. ఎందుకన్నది  ప్రశ్న. [ ’పేర్లని   మహర్షులు  నిర్ణయించారు’ అనుకొని మీ ఆలోచనని ఆపేశారు .  అల్లా అన్న పేరు మహర్షులే చెప్పారు. ఈ పాయింటుకి మళ్ళీ వస్తానేమో చూద్దాం]

ఏ మతం లో ఐనా దేవుడు ఒక్కడే అది హిందూవైనా ,ముస్లిమైనా, క్రిస్టియనైనా. ఉన్నది నేనొక్కణ్ణే అన్నాడు కృష్ణుడు, నేనే అన్నిరకాలుగా ఉన్నానన్నాడు, నేనే అన్నిపనులూ చేస్తానన్నాడు ……ఎవరి మనః ప్రవృత్తిని బట్టి వాళ్ళు అరాధించగల రూపంలో ఆరాధించుకోవడానికి మహర్షులు మార్గం ఏర్పరచారు. వివేకానందులు చికాగో లో ఒక మాట అన్నారు గుర్తుందా.
Unity in variety is the plan of nature, and the Hindu has recognized it. Every other religion lays down certain fixed dogmas and tries to force society to adopt them. It places before society only one coat which must fit Jack and John and Henry, all alike. If it does not fit John or Henry he must go without a  coat to cover his body. The Hindus have discovered that the absolute can only be realized, or thought of, or stated through the relative, and the images, crosses, and crescents are simply so many symbols – so many pegs to hang spiritual ideas on. It is not that this help is necessary for everyone, but those that do not need it have no right to say that it is wrong. Nor is it compulsory in Hinduism.

– ఈ చిలక పలుకులకేమొచ్చేలే గానీ , అసలు విషయం ఏంటంటే ,  నే చెప్పేది ఇదే! పై వాక్యాలకి నాది ఒక  ప్రాక్టికల్ అప్లికేషన్. మీరు  ’మతం’గా  దేన్ని ఫీలౌతున్నారో  అది lay చేసిన fixed dogmas,  trying to force society to adopt,  will not fit  యాదయ్య, సోదమ్మ అండ్ కిట్టయ్య.  I challanged to dare , to move ahead of the fixed dogmas and practices you grew up with. కానీ మీ ఓవరాల్ కామెంటు వల్ల  మీరింకా ఈ దిశలో ఆలోచించలేదని నాకు అనిపించింది. [ and in a different sense,  even i ve to move further] ఐతే, వివేకానందులు చికాగోలో చెప్పింది వేరే ఆడియన్స్‌కి. తన సొంత వారికి కాదు. నేను అవే మాటలు మనవారికే చెప్తున్నా – ఇప్పుడు ఇటు ఆడియన్స్‌కి.

స్వయంభూ క్షేత్రాల్లో ఆ దేవుడిని తప్ప ఇంకొకరిని అరాధించకూడదు. ఒక కధ చెప్తాను, నిజంగా జరిగింది అంటారు:
ప్రతాపరుద్రుడికి రోజూ  ఒక బంగారు శివలింగానికి అభిషేకం చేసి దాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అలవాటట.ఐతే ఒకసారి అహోబిళ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయం పూజకి శివలింగం తయారు చేస్తే పూజ మొదలుపెట్టేసరికి అది నరసింహ మూర్తిగా మారిందట. కంసాలిని తిట్టి మళ్ళి మళ్ళి తయారు చేయించాడు, ఎన్నిసార్లు చేయించినా అదే నరసింహ మూర్తి. అప్పుడు ఆయనకి తెలిసి వచ్చిందట, (ఎవరో చెప్తే) ఈ క్షేత్రంలో నరసింహ మూర్తిని తప్ప అన్యం ఆరాధించడం కుదరదు, అంతా ఆ నరసింహ స్వరూపమే అని. అప్పుడు ఆ నరసింహ స్వరూపాన్నే తీసుకుని కొండ పైకి వెళ్ళి పూజ చేస్తే ఆ మూర్తి లోనుండి పరమశివుడు ఆవిర్భవించాడు.
ఈ కధ మీరడిగిన తిరుగులేని తిరుమలరాయుడు కి సమాధానంగా పనికొస్తుందేమో చూడండి.

– చాలా ఇంట్రెస్టింగ్ కథ. అన్నట్టు  ఈ కధ  కూడా జనుల  భావాల్లో – symbolsలో  – విష్టువుకి-శివుడికి  మధ్య వైరుద్యం తెస్తున్న కాంఫ్లిక్ట్‌ని   సెట్ చేస్తున్నట్టు తెలిసిపోవడం లా? లేకపోతే ’ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి  సర్వోపగతుండు”  అన్నందుకు కాదూ  అసలు నరసింహుడై స్తంభంలో నుంచి వచ్చింది?ఇంకో స్టోరీలో ఓ గురువు శివలింగం మీద కాళ్ళు బెట్టి పడుకుంటే శిష్యుడు తప్పుబడతాడు. గురువుగారి కాళ్ళని తీసి శిష్యుడు ఎక్కడ  పెడితే ,  అక్కడే గురువు కాళ్ళ కింద ఓ శివలింగం ప్రత్యక్షమౌతుంది. ఇది కూడా చెప్పే నీతి అదే. ప్రతాపరుద్రిడికి తెలీలేదా 🙂

అద్వైతం చెప్పిన వాడు మళ్ళీ ఆరుమతాలు ఎందుకు స్థాపించాలి, అన్ని స్తోత్రాలు ఎందుకు రాయాలి అన్నదానికి అద్వైతం అన్నదాన్ని కొంత జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలని నా అభిప్రాయం. అద్వైతం అంటే అంతా ఒక్కటే రెండవది లేదు అని కదా. అంటే మనం ఎవరిని ప్రార్ధించినా అది ఆ ఒకే మూర్తిని అని అనుకోవచ్చుగా. అలాంటప్పుడు ఆయన చేసిన స్తోత్రాలు మనబోటి వాళ్ళకి అద్వైతం అంటే సరిగ్గా చెప్పడానికేమో కావచ్చుగా.?”ఏకశ్శబ్దః సమ్యక్ జ్ఞాతః” అన్నది కూడా ఈ విశయాన్ని ధృవపరుస్తుందని నా అభిప్రాయం. దానర్ధం ఒక్కటి నేర్చుకో చాలనా,లేక ఎన్ని నేర్చుకున్నా అన్నీ ఉన్న ఆ ఒక్కదాన్ని తెలుసుకోవడానికి సాధనాలు,అది బాగా తెలుసుకో అనా?

– అద్వైతంలో  “భగవంతుడు – భక్తుడు” ఒకటే.  చివరికి మనిద్దరమూ ఒకటే 🙂 ఆ తర్వాత మనకిక మాటలే ఉండవ్ 🙂 

కలుపుకుపోవడం అంటే కనపడకుండా పోయేంతగా కాదేమో , ఆలోచించండి.
– ’కనపడకుండా పోయేంతగా’ అన్లేదు . మీరే అలా కంగారు పడుతున్నట్టున్నారు. 🙂 భిన్నత్వం ఉంటుందనే మొదట నుంచీ చెప్పుకొచ్చింది.

>>నిజానికి ఎవరూ ఎవరినీ కలుపుకుపోలేదు(నిజంగా నిజం) . మీరన్నట్టు కలుపుకు పోయి ఉంటే ఈ పాటికి మీరన్నట్టు అల్లా భజనలు, క్రీస్తు హారతులు వచ్చేసేవి.  మన మానాన మనం బతుకుతుంటే వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పద్ధతులూ, మన పద్ధతులూ ఒకటి కాదు, కొంచెం సర్దుకుని చోటిచ్చారు, కలుపుకుపోయింది సంఘంలో మాత్రమే. అందరూ ఎవరి మానాన వాళ్ళు బతికారు. కొంతమంది అధికారం ఉంది కాబట్టి మేం చెప్పినట్టే బతకాలి అన్నారు. మొత్తంగా అలా కుదరలేదు. ఇప్పటికీ ఎవరి మానాన వాళ్ళమే బతుకుతున్నాం. ఏమంటారు?

-నిజమే. ఎవరి మానాన వాళ్ళమే బతుకుతున్నాం.  కాకపోతే సమస్యంతా హోల్ మొత్తం ఈ పేరాలో ఉంది. ఎవరి మానాన వాళ్ళు బతకడం తప్పు కాదు. కానీ ఎవరూ ఎవరినీ కలుపుకోకపోవడం ఎంత నిజమో,  కలుపుకోవడమూ అంతే నిజం. మరొక్క మాట : ఇస్లాం బయట నుంచి  వచ్చిందన్న మాట నిజం అనుకున్నా,  “వాళ్ళు వచ్చారు. కొంచెం సర్దుకుని చోటిచ్చాం” అన్నది పూర్తిగా నిజం కాదు 🙂 ఇక్కడి వారూ ఇస్లాంని కలుపుకున్నారు. ఈ బయట నుంచి రావటం -కలుపుకోవటం అనేది నిరంతరం సాగుతుంది. నేడు కూడా సాగుతోంది. అదే సనాతన ధర్మం. సరిగ్గా చూస్తే అదే అన్ని చోట్లా ఉంది. కంగారు పడక్కర్లేదు. మన నుంచి కూడా చాలా బయటికి  వెళ్ళింది.

మీ సింగిల్ లైన్ సమధానం ఇది.
“మన మానాన మనం బతుకుతుంటే వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పద్ధతులూ,మన పద్ధతులూ ఒకటి కాదు, కొంచెం సర్దుకుని చోటిచ్చారు”

ఈ సర్దుకుపోవటాలు సహనాలతోనే వచ్చింది చిక్కంతా 🙂 నేను మాట్లాడుతోంది “దేవుడు” గురించి.  ప్రశ్న: అల్లా = దేవుడు. అంతే! ఐతే, అది హిందూ భగవంతుడుకి, దేవుడికి పర్యాయపదం ఎందుకు కాలేదు? అది హిందూ పేరు ఎందుకు కాలేదు?
జ:  “మహర్షులు” మీ చేత ప్రాక్టీస్ చెయ్యించలేదంతే!

>>  మరి ఆ సనాతన ధర్మం లో దేవుడు ఒక్కడే అని ఉన్నది కదా, ఇంకా ఏ పేర్లతో పిలవాలి అన్నది మహర్షులు నిర్ణయించారు.
ఎవరీ మహర్షులు? నేడు పుట్టరా? పుడితే నా ప్రశ్న వాళ్ళకి.  కోటిన్నొక్క పేరు / శబ్దం – అల్లా  = దేవుడు.  Please kindly permit sir 🙂

>> నేను అడుగుతున్నది అదే, ఒక పక్క ఎవడి మతాన్ని వాడు ఆచరించమనే నా సలహా అంటున్నారు. మళ్ళీ పక్క మతంలో దేవుడిని పిలిచే పేరుతో నీ దేవుడిని ఎందుకు పిలవకూడదు అంటున్నారు. నేను అర్ధమ్ కాలేదన్నది అదే. ఇప్పుడు అలవాటు చేసుకోమంటున్నారు, ఎందుకు అని అడుగుతున్నాను. అలవాటు చేసుకోవడమంటే కొత్తగా మొదలుపెట్టడమేగా, మరి ఆ పని ముస్లిమ్‍లు చేసినా ఒకటే కదా, వాళ్ళూ ఇప్పుడూ కొత్తగా మొదలుపెట్టచ్చు తప్పేముంది,

– వాడు చేస్తే, నే చేస్తానంటారు ఇదేం వాదనండి బాబు. మీరు దేవుడి గురించి మాట్లాడండి. ముస్లిం గురించి కాదు. 

– నీ దేవుడూ వాడి దేవుడూ అంటూ ఇద్దరు లేరు – పక్క మతంలో పేరు కూడా ఒకే దానికి  సింబల్‍. రాముడు, కృష్ణుడు, షిర్డి సాయిబాబా కూడా సింబల్సే! 

– ఎప్పటికప్పుడు ‘కొత్త’గా మొదలెడితే ’సనాతనం’గా , నిత్య ’నూతనం’గా ఉంటాం – ’కొత్త’గా ఉంటాం.

మీరు హిందువు, మీకు అల్లాని కలుపుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది.
– అల్లా  అనంగానే రాముడికి కోపమొస్తుందేమో అని భయమొచ్చింది. అదే, “శివ శివ” అనంగానే రాముడికి కోపమొస్తుందేమో అన్న భయం కలగటం లేదు. అందుకని, అలవాటు చేసుకునే అవసరమొచ్చింది. 🙂
-ఐనా, హిందువుని గాబట్టే ఈ అవసరమొచ్చింది!! ఏమిటో ఈ ప్రశ్న!?

కలుపుకుపోతే వచ్చే నష్టమేంటి అని అడుగుతున్నారు, కలపకపోతే వచ్చే నష్టమేంటి అనే దానికి కూడా సమాధానం చెప్పండి కొంచెం.

’సనాతన ధర్మం’ కలుపుకునేలా చేస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. లాభ నష్టాలదేముంది లెండి. అదేమీ డబ్బు కాదుగా. కాకపోతే  ఇంకొంచెం ఎక్కువ పుణ్యం వస్తుందేమో కదా మనకి :))

అసలు చెప్పాలంటే అల్రెడీ చాలామంది హిందువులు దర్గాలకీ వెల్తారు, బాబాల దగ్గర తాయెత్తులూ కట్టించుకుంటారు. నిన్న నేనన్న ఎవరిమానాన వాళ్ళు బతుకుతున్నారు అన్న దాని అర్ధం ఒకరకంగా ఇది కూడా , పక్కింట్లో హిందువు ఒక దర్గా కి వెల్తే వాడినేమీ కత్తులతో పొడిచి చంపెయ్యట్లేదే, వాడివల్ల మతం నాశనమౌతుందని ఆపసోపాలు పడట్లేదే, వాడికి అందులో గురి కుదిరింది, ఎవరైనా భగవంతుడే కదా అందుకే వెల్తున్నాడు అనుకుంటాం అంతే.అప్పుడు మీరడిగిన “అల్లా అంటే భగవంతుడికే మరో హిందూ పర్యాయపదంగా ఎందుకు భావించలేకపోతున్నావు ” అన్న ప్రశ్నకి అర్ధం హిందువు దేవుడు అనే ప్రతి చోటా అల్లా అని రాస్తేనే అల్లాని భగవంతుడిగా భావించినట్టా, ఇంతమంది భగవంతుడిగా భావించకుండానే దర్గాలకూ, బాబా ల దగ్గరికి వెల్తున్నారా? కొంచెం క్లారిఫై చెయ్యగలరు.

ఇంతమంది’ సంగతి తెలీదుకానీ అలాగే భావించిన  “మహర్షులు” – “ఫకీరులు” – సంతులు – సద్గురువుల – whatever you call – గురించి విన్నాం. నేను ఆ బాట పడదామా అని ఆలోచిస్తున్నా. వాళ్ళు ఎందుకు ఫైయిలయ్యారో లేక సక్సస్ అయ్యోరో తెలిస్తే  బావుంటుంది నాకు.

I am not the first one to think in this direction. But, i feel no one succeeded , say like Sankaraacharya  as yet. If there is a Sankara today i feel he would have given me some tools to practice –  like those so many hymns he had given us.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

7 వ్యాఖ్యలు పై ““ఇకడెవ్వరూ ఎవ్వరిని కలుపుకోలేదు …***య్ బే””

 1. srini Says:

  *నేను ఆ బాట పడదామా అని ఆలోచిస్తున్నా. వాళ్ళు ఎందుకు ఫైయిలయ్యారో లేక సక్సస్ అయ్యోరో తెలిస్తే బావుంటుంది నాకు.*
  వాళ్ళకి సక్స్ లేవు ఫైల్యుర్స్ అంత కన్నా లేదు. వారి దృష్టిలో నువ్వు అనుకున్న,ఊహించుకున్న ప్రపంచం లేనే లేదు. ఇటువంటి అద్వైత చెత్త అర్థం కావాలంటే ఒక్క సారి ఐనా ఔట్ ఆఫ్ బాడి అనుభావాలు కలిగితే కొంతవరకు వెంటనే సులభం గా అర్థమౌతుంది. లేక పోతే జీవితాంతము చదివిన పుస్తకాలు చదువు కొంట్టూ, వాదించు కొంటూ , ఎదో ఉందని ఊహించు కొంట్టూ కాలాన్ని,డబ్బులను వృధా చేస్తూ ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు.
  *If there is a Sankara today i feel he would have given me some tools to practice – like those so many hymns he had given us.*

  There is no need for tools. Fools will use tools.
  Read, understand, feel and enjoy his hymns. Nothing else more is required to understand.

 2. manohar ch Says:

  కలుపుకుపోవడం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో మీకే క్లారిటీ లేదనుకుంటా,అల్లాని కూడా ఈ దేశంలో దేవుడిగానే పూజిస్తున్నారు, ఇక మీరంటున్న కలుపుకుపోవడం ఎక్కడ జరగట్లేదో నాకర్ధం కావట్లేదు, ఉన్న సాహిత్యం మొత్తాన్ని అల్లా పేరుతో తిరగరాస్తే తప్ప కలుపుకున్నట్టు కాదేమో అని మీరు భావిస్తే ఎవరూ చేయగలిగింది లేదు, మీరే మొదలుపెట్టాలి.
  “ఇరానీ కేఫులో చాయ్‍తో సిగరెట్ కొడుతూ చర్చిస్తే , మనోహర్ లాంటి మిత్రుడు ఒక్క లైన్లో ఇలా చెప్పగలడు : “ఇకడెవ్వరూ ఎవ్వరిని కలుపుకోలేదు …***య్ బే” ”
  నేను మాట్లాడేది మీకలా అనిపిస్తే , నా భాషలో అన్న దోషం ఉండి ఉండాలి, లెక మీ భావనలో అన్నా దోషం ఉండి ఉండాలి, ఈ కామెంట్ కూడా మీకు అలాగే అనిపిస్తే ఇక మనం చేసే చర్చ ఆరోగ్యకరంగా ఉండకపోవచ్చు. ఎవరిదారిన వాళ్ళు కామ్ గా ఉండడం మంచిది.

  ఎవరూ ఎవరినీ కలుపుకుపోలేదు అనడం లో నా ఉద్దేశ్యం, ఎవరి కిష్టమైన దారిలో వారు నడుస్తున్నారు అని మాత్రమే, అది మీకు ఇలా అర్ధమయ్యిందేమో

 3. rayraj Says:

  @srini: agreed. I do. అందికే ఆ తరువాత మాటలుండవు అన్నాను.
  By the way, I don’t have any out of body experiences.

  And another point – in spite of this, he has gone out to spread it as knowledge and gave out the hymns. Why?
  Krishna says in Gita that he does not have to work yet he works incessantly. Shankara is not bound “to give” any new hymn but he is not bound to ‘not to give’ either!

  @manohar: We can discuss. But, let’s stay calm for some time. You have to look at the body below the star -line. The purpose of the para above that is different. That sentence can be safely ignored by you.

 4. xyz Says:

  అందుకే మరీ ఎక్కువ్గా తెలుగల అలొచిమ్చకుదదు 😉

 5. rayraj Says:

  @srini: Even ‘utter waste’ has ‘useful’ness, if we only we can see it:)
  Anyway, Why are you asking me not to publish. You say yes, i actually want to publish your comment.
  @xyz: 🙂
  @Mahesh: 🙂


 6. ఇరానీకేఫులో చాయ్ సిగరెట్ అంటూ మొదలెట్టి ఇట్టా బాదితే ఎలాగండీ?? 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: