ఛాయారాజ్ ’కుంతి’ via కొత్తపాళీగారి ’టపా’

ఛాయారాజ్ అనేవారి ’కుంతి’ అనే కవితనిచ్చి,  ఇది కవితా? ఐతే ఎందుకు? కాకపోతే ఎందుకు? అంటూ కొత్తపాళీగారు ఓ ’టపా’ వేశారు. కామెంటు పెద్దదవ్వటంతో, as usual, నా బ్లాగులోనే  ’పోస్ట్’ చేస్తున్నాను.

రేరాజ్ కూడా కవితలు రాస్తారుగానీ  ఎవరూ చదవరు.  ఆ కవిత ఏదన్నా ఇచ్చుంటే ఏది కవిత్వం కాదో బాగా తెలిసేదేమో 🙂 .  సరే, ముందు  ’కుంతి ’ కవితను చూడండి.
***************************************

యవ్వనం చెవిలో ఎన్నెన్ని కామసూత్రాలు ఊదేడో?
పూల బాణాలతో కొట్టించి పూర్తిగా వివశురాలిని చేశాడు
ముగ్ధ మనస్సును అగ్నిగోళంలో తోశాడు
సూర్యుణ్ణి ఊహించి సుందరుణ్ణి ఊహించి
వేణిని జారేసుకుంది వోణీని జారేసుకున్నట్లు
తెలుసుకో లేక పోయింది మేక వన్నె పులి లాంటి
గెడ్డం పెంచుకున్న ముని కీచకుడి ముందు కాలు జారేసుకున్నట్లు ..
స్పృహ తెచ్చుకొన్నప్పటికి పొద్దు పొడిచింది

కుండపోతగా ఏడుస్తున్న కన్నెను
దున్నపోతుల్లా వచ్చి దీవించారు దేవతలు
ఆకాశం అడ్రసిచ్చి నిష్క్రమించాడు ఇనుడు
ఇంద్రుడికి ఈర్ష్య చంద్రుడికి నవ్వు
కడుపు శోకంతో కర్ణుణ్ణి కాల ప్రవాహంలో విడిచింది

కడుపు మంటలో కడుపు పంట గుర్తును
గుప్త పరుచుకొంది హిందూ రాజ్యాంగం
భారతాన్ని తెలుగు చేసిన రాజాశ్రిత కవి నన్నయ
కన్నె రేప్ గుట్టును మరింత రసవత్తరంగా రట్టు చేసి
మానభంగ సంస్కృతిని ఆర్ష ఆదర్శంగా ప్రకటించాడు
కన్నెలు గర్భవతులైతే కర్ణులూ భరతులూ పుడతారని
కవి సామ్రాట్టులూ కరుణశ్రీలూ ఖండ కావ్యాలు రాసి
భాషా ప్రవీణ వారసులతో
బడిపిల్లలకు బోధిస్తూ బులుపు తీర్చుకున్నారు

కళ్ళంలోనూ కాలిబాటల మీద హాస్టళ్ళ ముందు హాస్పటళ్ళ వెనుక
కన్నె పిల్లను కని వదిలేస్తుంది
ప్రభుత్వం అనాధ శరణాలయాలను చూపిస్తుంది
స్త్రీ శిశు సంక్షేమ బడ్జెట్టు మగ తేనెటీగలకు విందు చేస్తుంది
ఫ్యూడల్ సంస్కృతి పురిటిలోనే మీసమెత్తి పుడుతుంది

ఆనాటి కుంతి అవిశ్రాంతంగా ఆలోచిస్తూ బతికిపోయింది
నిన్నటి కుంతి నిరంతరం పెనుగులాడుతూ హత్య గావించబడింది
నేటి కుంతి
సంఘటిత పోరాటాల లోనికి అహ్వానించ బడుతోంది.
****

ఇది కవితే.  నాకు  ఇందులో ఐదు భాగాలు కనబడ్డాయి  (కొత్తపాళీగారికి మూడే కనపడ్డాయ్).

1.యవ్వనం చెవిలో ఎన్నెన్ని కామసూత్రాలు ఊదేడో?…..స్పృహ తెచ్చుకొన్నప్పటికి పొద్దు పొడిచింది.
ముని చెప్పింది మంత్రాలు కాదు. మాయమాటలతో మోసం చేసి పని చేసుకున్నాడు. పిల్లకి తెలివొచ్చేసరికి తెల్లారింది – అన్న భాష్యంతో  “కుంతి కధ”ని మొదలెట్టడం – మొదటి భాగం. “గెడ్డం పెంచుకున్న ముని కీచకుడి ముందు కాలు జారేసుకున్నట్లు ..” అంటే, ఆ మునినే మరో రకం కీచకుడిగా వర్ణిస్తున్నట్టు నాకు అర్ధమయ్యింది.

2. కుండపోతగా ఏడుస్తున్న కన్నె…..కడుపు శోకంతో కర్ణుణ్ణి కాల ప్రవాహంలో విడిచింది.
కర్ణుడు అన్న పదంతో ” ఇదీ కుంతి కథ ” అని చెప్పటం పూర్తయ్యింది. కానీ ఇంద్రుడు , చంద్రుడు ఎందుకొచ్చారో అర్ధం గాలేదు.

3.కడుపు మంటలో కడుపు పంట గుర్తును ….బడిపిల్లలకు బోధిస్తూ బులుపు తీర్చుకున్నారు
ఆ కథ ఎప్పటికీ గుర్తుండి పోయింది. ఎలా?  అ) హిందూ రాజ్యాంగంలో ( అదెలాగో అన్వయం రాలేదు)  ఆ) రాజశ్రిత కవులు – Feudal కవుల భాష్యంలోనూ ఇ)అటు పిమ్మట, కవి సామ్రాట్టు, కరుణశ్రీల భాష్యాల్లోనూ.

4.కళ్ళంలోనూ కాలిబాటల మీద–కన్నె పిల్లను కని వదిలేస్తుంది–ఫ్యూడల్ సంస్కృతి పురిటిలోనే మీసమెత్తి పుడుతుంది
ప్రస్తుత వ్యవస్థ కూడా ఇంకా అదే ఫ్యూడల్ సంస్కృతి అని చెప్పబూనటం.

కానీ మీరే అన్నట్టు  ఓ దిశా నిర్దేశం కోసమై – కుంతిలో మాత్రం మార్పు వస్తున్నట్టు – ఐదోది.

5. ఆనాటి కుంతి అవిశ్రాంతంగా ఆలోచిస్తూ బతికిపోయింది…నేటి కుంతి సంఘటిత పోరాటాల లోనికి అహ్వానించ బడుతోంది.

ఇందులో-
నిర్దిష్టమైన వస్తువు – ఉంది.
చెప్పడంలో ప్రతీకల వాడుక– ఉంది
భాష వాడుకలో ఒక చమత్కారం – ఉంది

జస్ట్ ఈ మూడిటితో  కూడా ఇది కవితే అయ్యింది.

ఒక లయ – చాలా తక్కువ ; లేదనిపించింది.
వ్యంగ్యంలో ఘాటైన విరుపు – సో సో
ఎంత స్పష్టంగా చెప్పడం ఉన్నదో కొంత సంక్లిష్టత, కొంత తెరమరుగు  కూడ ఉన్నది –  ఔను. కొద్దిగానే.
వివిధ దృక్కోణాలకి, విభిన్న విచారణలకి తావిచ్చే  సంక్లిష్టత – లేదు. సుస్పష్టంగా  పరమ నిర్దిష్టంగా ఉంది. నిజానికి  “తెరమరుగు” అన్నది కూడా  చాలా తక్కువ.

ఐతే,  ఇది కవితే ఐనప్పటికీ,  ’కుంతి – మోసపోవటం’ అనే ఐడియానీ,  ఈ కధలన్నిటికీ  ఒక చట్రంలో  సరికొత్త భాష్యం ఇచ్చే ఐడియానీ  వాడుకొని చేస్తున్న ఓ ప్రయత్నం అని అర్ధమౌతున్నా,  ఈ కవిత నన్ను ఆకట్టుకోలేదు. కారణం  – ఆ ఐడియాలే ముందుగా నన్ను అంతగా ఆకట్టుకోకపోవడం.  ఇలాంటప్పుడే   ’ఇదీ  ఓ కవితే?’  అనుకుంటాం.

ఉదా: ఎవరైనా ఇంసెస్టు ప్రేమ మీద కవిత రాస్తే? Ofcourse ప్రతీకలు కూడా ఇంసెస్టు పరంగానే ఉంటాయి 🙂

అంచేత I think I agree with కామేశ్వర్రావుగారు హియర్. అదే  కొంచెం రీ-ఫ్రేజ్ చేసుకుంటూ చెబుతాను:

ఓ ఆ‌ర్ట్‌వర్క్‌ – కవిత – నచ్చడానికీ నచ్చకపోవడానికీ అందులో చెప్పిన విషయంతో పాఠకునికి సహానుభూతి ఉందా లేదా అన్నది అతి ముఖ్య  కారణం. దాని రూపమూ, అభివ్యక్తి వగైరా వగైరా ఆ సహానుభూతిని కలిగించడానికే  ఉపయోగించుకునే పనిముట్లు.

[ ఇది గనక నిజమని ఒప్పుకోగలిగితే,  ’తెలుగులో ఆలోచించటం’ అనేది  ఈ తెలుగు మార్కెట్టుకి వివిధ అంశాలతో/ideaలతో ఉండాల్సిన   ’సహానుభూతి’ ని పెంచటంలో ఎలా దోహదపడుతుందో అర్ధం చేసుకోవచ్చన్నది , ఇంకో కోణంలో  నే చెప్పదల్చుకున్నానన్నమాట 🙂 ]

కారణాలేమైనా కానీయండి.  నేను కూడా “కుంతి” ని అమాయకురాలిగానో , మోసపోయినదానిగానో  చూసి “జాలి”  పడను. కొన్ని కొన్ని సమయాల్లో కొంత కొంత మంది మనష్యులకి, అలా ఏదో కొన్ని జరిగిపోతాయి. [అందరం అవే భావోద్వేగాలకు లోనైనా, కొందరు మాత్రం విచక్షణతో  జీవితాన్ని గడిపి విజయులౌతారు. ఇటేపు పోతే ఇక చాలా పెద్ద పోస్టవ్వచ్చు. సో, దాంతో వదిలేస్తాను]

నిజానికి కుంతి  కూడా Feudal landlord lady యే – who perhaps wanted to experiment and yet found her way to keep her value system intact in the eyes of the common man. So, దీన్ని మొత్తం నేను మూడే లైన్లలో చెబుతా –

ఆనాటి కుంతికి,  అరిచే అవసరం లేకుండానే గడిచిపోయింది.
నిన్నటి కుంతికి అవసరమై   అరిస్తే , చచ్చిపోయింది
నేటి కుంతిని, సంఘటిత పోరాటం ఆహ్వానిస్తోంది.

Now if you go back and read it, I hope you may stll appreciate his work but it no more stands as much a poetry as you thought so. Because the poet actually wanted to state only the last line and the rest all is just a work upwards. ఏమంటారు? ( అబ్బే నిఝంగా నాకు పొయిట్రీ తెలీదండీ. ఐనా తెలిసినట్టు మాట్టాడాను )

please clarify me on:
వేణి అంటే  ఏంటి?
ఇంద్రుడు చంద్రుడు ఎందుకొచ్చారు?
హిందూ రాజ్యాంగంలో ఎలా గుప్త పరిచారు?
ఆఫ్సర్‌గారి కవితకి ఇంగ్లీషు అనువాదాలు ఎక్కడున్నాయి?

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

11 వ్యాఖ్యలు పై “ఛాయారాజ్ ’కుంతి’ via కొత్తపాళీగారి ’టపా’”


 1. సారీ రేరాజ్ గారూ, మీరు రాసిన సుదీర్ఘ విశ్లేషణలో కొత్తగా చెప్పినదేవిటో నాకు అంతు పట్టలేదు.
  మీరు చివర్లో అడిగిన ప్రశ్నలకు,
  వేణి అంటే ఏంటి?
  = తలకట్టు, జడ, కృష్ణవేణి అంటే నల్లటి జడగలది
  ఇంద్రుడు చంద్రుడు ఎందుకొచ్చారు?
  పురాణాల్లో ఇంద్రుడు చంద్రుడు వివాహేతర సంబంధాలకి పెట్టింది పేరు. అహల్యతో వ్యవహారంలో శాపం పొందినందుకు, ఇక్కడ ఏమీ బాధ్యత లేకుండా తప్పించుకు పోయిన సూర్యుణ్ణి చూసి ఇంద్రుడికి ఈర్ష్య. తారతో వ్యవహారాన్ని బాగా నేర్పుగా నిర్వహించుకున్న చందుర్డికేమో నవ్వొస్తున్నది.
  హిందూ రాజ్యాంగంలో ఎలా గుప్త పరిచారు?
  ఈ రాజ్యాంగం రిఫరెన్సే నాకూ అర్ధం కాలేదు. ఒక విధంగా అర్ధం చేసుకోవచ్చు – కుంతికి పెళ్ళికాక మునుపు జరిగిన ఈ సంఘటన ఆమె కడుపుకోతకి కారణమైతే, పెళ్ళైన తరవాత, అదే వరం ఆమెకీ ఆమె సవతికీ లీగల్ సంతానాన్ని పొందేటందుకు ఆధారమైంది. ఆ రిఫరెన్సు కావచ్చు, కానీ నాకే అది convoluted గా ఉంది. Basically the legal/political system legitimized the same rape process which produced Karna now to produce legal heirs to the Pandava throne.
  ఆఫ్సర్‌గారి కవితకి ఇంగ్లీషు అనువాదాలు ఎక్కడున్నాయి?
  నాకు గుర్తున్నంతలో అఫ్సర్ పద్యాలు రెండు తర్జుమా చేశాను. ఆయనకి ఇదివరకు ఒక wrodpress బ్లాగుండేది. అందులో ఈ తర్జుమాల్ని పెట్టినట్టు గుర్తు. ఆయన్నే అడిగితే బెటరు.

 2. ramesh Says:

  Feudalism was a particular Social/political/religious system in Europe. Similar to Caste system (social/political/religious) in India.

  You can not apply Caste system to Europe, conversely you can not apply Feudalism to India.

  But you can draw faint parallels.


 3. 🙂 🙂 🙂
  ఎస్.ఎ.బైరప్ప రాసిన “పర్వ” చదవండి.

 4. rayraj Says:

  @కొత్తపాళీ : ఏమీ లేదు. As usual, పొట్టిగా అడగటం రాలేదంతే 🙂
  But, now i could not fit my meaning for the గెడ్డం ముని!Isn’t there a slight difference there?

  @Mahesh: Ok. మరీ మూడు స్మైలీ లేసేశారు. తెలిసింది మీరే తెలియజేయొచ్చుగా? 🙂

 5. కామేశ్వర రావు Says:

  రేరాజ్ గారు,

  మీరు చెప్పిన అయిదు భాగాల్లో, మొదటి భాగం నాకస్సలు అర్థం కాలేదు (మీ కామెంటుబట్టి, మీకూ అర్థం కాలేదని తెలిసింది! :-).

  ఫ్యూడల్ సంస్కృతికీ కవి చెప్పదలుచుకున్న సమస్యకీ ఒకవేళ సంబంధం ఉన్నదనుకున్నా, అంత మహారాజు కూతురైన కుంతి విషయంలో చట్ట విరుద్ధమై, ఒక బేస్తవాని కూతురు (సత్యవతి) విషయంలో ఎందుకు కాలేదన్న ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ చర్చించడానికి కవిత సరిపోదు. అందుకే ఆ పోలిక అర్థం లేనిదని నాకనిపించింది.

  కర్ణుడి జననమే కాకుండా మిగిలిన పాండవుల జననాలని కూడా “rape process”గా కొత్తపాళిగారు అభివర్ణించడం నాకు మింగుడుపడలేదు!

  “దాని రూపమూ, అభివ్యక్తి వగైరా వగైరా ఆ సహానుభూతిని కలిగించడానికే ఉపయోగించుకునే పనిముట్లు”

  ఈ కవిత రూపమూ అభివ్యక్తీ వగైరా, ఈ చెప్పిన విషయంతో సహానుభూతిని కలిగించడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో నాకు బోధపడలేదు. మీ వివరణలోకాని, కొత్తపాళిగారి వివరణలోనూ నాకిది కనిపించలేదు.

 6. rayraj Says:

  @కామేశ్వరరావు:
  కదా! థాంక్సండి. ఈ కుంతి పోలికే అసలు సెట్ అవ్వట్లేదు మనకి. మరి ఇక మిగితాది ఎలా మింగుడు పడుతుంది? ఔనూ రాజాశ్రిత కవులు దీన్ని రేప్‌గా రాశారా? అస్సలు తెలీకనే అడుగుతున్నాను. నేనంత సాహిత్యాన్ని ఏమీ చదవలేదు(లేను)

  మహేష్ ఏమో “పర్వ” చదవమంటారు. ఎక్కువ అడిగితే మరీ వెంటబడుతున్నానంటారు. మీరు చదివారా? ఓ పని చేయండి. నాగమురళి గారిని ఇందులొకి గుంజకూడదూ మీరు! ప్లీజ్!

  ఆ “పనిముట్లు” విసిరి పారేసెయ్యండి. క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకుందాం.

  @కొత్తపాళీ: మీకూ చెప్పడం మరిచాను. థాంక్యూ.

  @Rajasekhar: థాంక్యూ. మీకు తెలుగు బ్లాగు ఏదీ లేదా? Please reply.

  @Ramesh: ఆ Faint parallel కూడా సరిగ్గా సెట్ అవ్వక ఇబ్బంది పడుతున్నాం.

 7. కామేశ్వర రావు Says:

  ఈ కవిత అర్థమవ్వడానికి భారతం చదివితే సరిపోక పర్వ చదవాల్సిన అవసరం ఉంటే ఆ పర్వ చదువుకుంటే చాలదూ మళ్ళీ యీ కవితెందుకు?
  నేను పర్వ చదవలేదు. మీకు ఆసక్తి ఉంటే మీరే నాగమురళీగారిని అడగండి, మధ్యలో నా సిఫార్సెందుకు? 🙂


 8. ఎవరో మిత్రులు లంకె పంపితే చూశాను.
  >భారతాన్ని తెలుగు చేసిన రాజాశ్రిత కవి నన్నయ
  >కన్నె రేప్ గుట్టును మరింత రసవత్తరంగా రట్టు చేసి
  >మానభంగ సంస్కృతిని ఆర్ష ఆదర్శంగా ప్రకటించాడు

  నాకు తెలిసినంతలో నన్నయ గారు సత్యవతీ-పరాశరుల సమాగమాన్ని చాలా చెత్తగా వ్రాశాడు. ఈ విషయమై ఆయన్ని చాలా తీవ్రంగా తిట్టినవాళ్ళున్నారు. సత్యవతీ పరాశరుల సమాగమాన్ని అతి పవిత్రమైనదిగా, ఆధ్యాత్మికమైనదిగా అభివర్ణించిన నవల ఉన్నది. (వివరాలు కావాలంటే నన్ను వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును).

  అలాగే కవిత్రయం భగవద్గీతను సరిగా అనువదించకపోవడాన్ని గురించీ, సనత్సుజాతీయాన్ని మొత్తంగా వదిలిపెట్టెయ్యడాన్ని గురించీ తీవ్రమైన విమర్శలున్నాయి (మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్లో కాకపోవచ్చు. ఒక రిఫరెన్సు మాత్రం వ్యక్తిగతంగా ఇవ్వగలను).

  ‘పర్వ’ నేను చదివేను. దాని గురించి ఇదివరకు రివ్యూ కూడా రాశాను. అందులో పాండురాజు సంసారానికి పనికిరాడనీ, కుంతి హిమాలయ ప్రాంతాల్లో ఉండే ‘దేవజాతి’ మనుషుల్తో (ఆటవికుల్తో) సంభోగించి పిల్లల్ని కన్నదనీ రచయిత ఊహాగానాలు చేశాడు. కర్ణుడి పుట్టుక గురించి కూడా ఈ కవితలో చెప్పినట్టుగానే ఉంటుంది.

  చాలా ప్రసిద్ధమైన కథలని అందరూ పబ్లిక్ ప్రాపర్టీలాగా ఫీలవుతారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. అనేక రకాల అభిజాత్యపు (రేసిస్టు) అయిడియాలూ, రాజకీయ సిద్ధాంతాలూ, కులాల రొచ్చూ, అసభ్యకరమైన అశ్లీలాలూ అన్నీ చొప్పిస్తారు (మన పురాతన దేవాలయాల శిధిలాల్లో జనాలు గ్రాఫిటీలు రాసినట్టూ, చెత్త పోసినట్టూ). అలాగే ఆయా కథలని మార్మిక పరిభాషలోనూ, ఆధ్యాత్మికమైన సత్యాలని దాచుకున్న పొడుపు కథలుగానూ మరికొందరు వివరిస్తారు. ఎవరి అభిరుచునీ, ఆసక్తినీ బట్టి వాళ్ళకి కావలసిన ఇంటర్ప్రెటేషన్ ని ఎంచుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉన్నది. ఇదే ఒప్పు అని ఎవరూ పనిగట్టుకుని బాకా ఊదాల్సిన అవసరం లేదు, రాజకీయమైన ఉద్దేశాలేవో ఉంటే తప్ప.

  ఈ కథల్ని పట్టుకుని సెన్సేషనలైజ్ చేసి దుమ్మురేపుదామనుకునేవాళ్ళని, మన అభిరుచికి వాళ్ళు సరిపడకపోతే, పట్టించుకోవడం అనవసరం. ఈ కథల్లో వాళ్ళు కనుక్కున్న గొప్ప సత్యాలు ఏమీ లేవు.

  ఇంతకన్నా నేను ఈ చర్చలో పాలుపంచుకోను. ఇక ఎవరేం రాసినా మళ్ళీ వ్యాఖ్యానించను.

 9. rayraj Says:

  I was offline for some time and i am seeing your comment just now. Thanks for visiting and giving your comment and thanks to the friend whoever referred this!! Please keep coming. We can discuss.

  >>ఎవరి అభిరుచునీ, ఆసక్తినీ బట్టి వాళ్ళకి కావలసిన ఇంటర్ప్రెటేషన్ ని ఎంచుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉన్నది. ఇదే ఒప్పు అని ఎవరూ పనిగట్టుకుని బాకా ఊదాల్సిన అవసరం లేదు, రాజకీయమైన ఉద్దేశాలేవో ఉంటే తప్ప.

  Almost agreed. Just not politics, perhaps.But -ఉద్దేశాలేవో ఉంటే తప్ప…ya . I agree.

 10. Rajasekhar Says:

  I used to have a telugu-blog sir. Not any more.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: