శృంగేరిలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

“We eat food always. Its just the food form that keeps changing” – Jayesh K Gopalan
_________________________________________________________________________

ఇది ఓ చరిత్రాత్మక సంఘటనట!666 సంవత్సరాల తర్వాత జరిగిందిట!

శృంగేరిలో ఓ గుడి కట్టి, మొన్న 16.02.2011న,  ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అసలు ఈ ప్రాంగణంలో ఇదువరకు ఓ ఆలయనిర్మాణం జరిగి, ఆరువందల సంవత్సరాలయ్యింది ట! అప్పటిలాగానే  పునర్వసు నక్షత్రంలో, మాఘ శుక్ల ద్వాదశినాడే ఈ పతిష్టాపన జరగాలని అనుకున్నాగానీ, అది మంగళవారం అవ్వటంతో, త్రయోదశి- బుధవారంనాడు చేశామని జగద్గురువులు అన్నారు.(ఇక్కడ నా తోక కామెంటు ఒకటి – ఈ రోజు ’మిలాద్-ఉన్-నబీ’ కూడా మరి! మనలో చాలా మందిమి హాలిడే అనుభవించిన పర్వదినం)

గౌరిశంకర్ ట- ఈ ప్రాజెక్టు నెత్తినేసుకొని చేసిన వ్యక్తి పేరు. శిల్పి పేరులో ఏదో శంకర్ ఉందిట! చివరికి ఆలయ శిఖరం మోసుకొచ్చిన క్రేన్ కంపెనీ, చెక్కిన స్టోన్ ఫ్యాక్టరీ అన్నీ శంకర్ పేరే కలిగి ఉండటం కాకతాళీయమే,  భగవత్సంకల్పమేనంటారు ఈ గౌరీ శంకర్. నాకు మాత్రం, ’తెలిసో తెలీకో తమరే అలాంటి నిర్ణయాలు తీసుకోనికూడా ఉండొచ్చు మహానుభావా’ అనిపించింది. సదరు మనిషి ఉపన్యాసంలో అంటారు – నేడు మనం అనుసరిస్తున్న మన సనాతన ధర్మం ఈ విధంగానైనా ఉండటం ఆదిశంకరుల కృపే కదా! అలాంటి అవతరారమూర్తికి ఊరూరా ఓ ఆలయం ఉండవలసింది కానీ, అలా జరగలేదోంటో కదా అని!? అంటే సనాతన ధర్మం అనేది ఒకానొక మతం అని వారి ఉద్దేశ్యం. నాకు చిరాకేసింది. కానీ ఏమి చెయ్యగలం!?

జగద్గురువులు ఉపన్యసించారు. గౌరి శంకర్ చెప్పినట్టు, ఎందరో సహకారం వల్ల ఆలయనిర్మాణం జరిగింది కానీ, అది తన ప్రభావం వల్ల కాదని, ఆయా వ్యక్తులకు అద్వైత సిద్దాంతం మీద ఉన్న నమ్మకం వల్ల అలా సహకరించారని చెప్పారు. తాను ఈ కార్యానికి నిమ్మిత్త మాత్రంగా ఇక్కడ కూర్చోవడం తన భాగ్యం! అంతే! నన్నారు. ఆలయం ఉంటే బావుంటుందనేది తమ సంకల్పం అని చెప్పినా,  ఒక వేళ అది నిర్మించకపోయినా వారు పెద్దగా విచలితమయ్యేదీ లేదన్నట్టు –  నా కర్ధమైన వారి భారీ సంస్కృతకన్నడం[ జగద్గురువులు దక్షిణ భారత భాషలన్నీ మాట్లాడగలరుట; బైదివే, ఆయన ఆరిజన్ తెలుగే! తెలుసా? 🙂 ]  ప్రాజెక్టు ఐడియా కిందటి జగద్గురువుకే ఉన్నట్టు కూడా అర్ధమయ్యింది – గౌరి శంకర్ ఉపన్యాసంలోనో ఎక్కడో.ఏమైనా, ఈ నాన్- ఎటాచ్డ్ యాటిట్యూడ్, నాకు సత్వం లాగా కంటే, తామసం లాగానే గోచరిస్తోంది మరేంటో.

కేరళలో పుట్టిన శంకరులు, తన చోటుని వదిలి వెళ్ళి,  ఆమ్నాయ పీఠాలను శృంగేరిలోనూ, పూరీలోనూ, బదరీలోనూ ద్వారకలోనూ నిర్మించి, తన గొప్పతనాన్ని చూపించారు. In other words, గొప్ప నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించారని భావం! నిజమే, ఒక్క చోట కూడా, స్థానిక వ్యక్తులని పీఠాధిపతులను చేయలేదాయన. కానీ, నా బాధేంటంటే, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించాల్సిన నేటి జగద్గురువులు, అంత చేసిన ఆయనకి గుడి కట్టేసి చాలా స్థానికమూ పరిమితమూ ఐపోయేరేంటని!? ట్రాన్సిడెంటల్ యోగాలు, సమాధిలు సాధించే వారికి, కర్తవ్యమేలేని సన్యాసికి మతాన్ని రక్షించడమే జ్ఞానమెందుకయ్యింది? కర్తవ్యమెందుకయ్యింది? ఏమీ పాలుపోలేదు. ఐనా పాలుపోతే ఏంటీ, పెరుగైతే ఏంటీ? – అద్వైతాన్ని రక్షించడం ఏంటి? నాశనమవ్వడం ఏంటి!? అంతా మాయ! నల్లకుంట అమ్మవారి దగ్గరే, ఈ మాయలో ఇంతకన్నా ఎక్కువ ఆనందించిచనట్టుగా నాకు అనిపించింది.

జగద్గురువులగారి non-attached సంకల్పంలాగానే, నాకు ఈ మధ్యే ఓ కోరిక పుట్టింది మొన్న(చూసే ఉంటారుగా!) ఏమో! కెసీయారుగారి డివిజివ్ పాలిటిక్స్‌నే గాంధీ రాజకీయం అనుకునే రోజులొచ్చాయి. నా యూనిఫైడ్ రిలిజియాసిటీ వల్ల, నేనే ఓ అద్వైత సిద్ధాంత బహు మత సంస్థాపక, ఆలయం, భువనాలయం ఐపోతేనేమో? ఎవడికి తెలుసు!

నాకిదినచ్చలేదన్నాను నా కొలీగ్ జయేష్‌తో. “సనాతన ధర్మం నాశనమవ్వటం ఉండదు. ఎప్పటికి ఉండేదొకటి ఉంది. అదే ఇన్ని రూపాల్లోకీ, కొత్త రూపాల్లోకీ మారుతూ ఉంటుంది.”

అప్పుడు కొలీగ్ జయేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది: “We eat food always. Its just the food form that keeps changing”

“అద్దరగొట్టేశావ్ కదా! నిజం.
మన ఉద్యోగంలో అలా కొత్తరూపాన్ని సంతరించుకోలేక, ఈ జీవితం మీద విరక్తి పుట్టి నేను సన్యాసినవుతానేమో అని  నువ్వు భయపడ్డావు. కానీ, ఇక్కడ ఏ నవ్యత్వం లేక, అదే పాత సరుకుని ’సనాతనం’ అన్ని అమ్మజూస్తుంటే, నాకు దీని మీద కూడా విరక్తి పుట్టింది. ఏంటో!” అన్నాను.

జయేష్ రిప్లై ఇది: “సన్యాసం మీద కూడా విరక్తి పుట్టిందంటే, అదే నిజమైన వైరాగ్యం”.

We broke into a loud laugther.

oh ya! Sankara breaks me free! even from this!
______________________________

శృంగేరి సైటు : www.sringeri.net

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

6 వ్యాఖ్యలు పై “శృంగేరిలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు”

 1. sri Says:

  ఆర్యా,

  రేరాజు గారు మీరు కత్తి గారికి ఎక్కువ మార్థండకి తక్కువ. అసలికి ఎప్పుడు చూసినా అద్వైతం మీద టపాలు రాస్తారెందుకు? మీకు ఉన్న కంఫ్యుషన్ తో అందరిని వెర్రి వాళ్ళని చేద్దామనా మీ ఉద్దేశం? కట్టె విరగకుండా పాము చావకుండా సామేత లా మీరు రాసే టపాలు ఉంటాయి. మీరు చూడబోతే అద్వైతం మీద బురద చల్లడానికి బ్లాగులోకం లో ఉన్న నకిలీ కణికుడు నం 10వర్గం వారిలా ఉన్నారు. కిరస్తాని ఏజేంట్ కాదు కదా?

 2. rayraj Says:

  @sri (ni) :
  Let me first give you some familiar lines :

  In general some people will have certain experiences. Different people will react in different ways. One example is RamaNa maharshi. Can you at least consider Jesus Christ had some similar experience- for the sake of argument at least!? Or is it just a prerogative of some of us who are born only in India?
  —————————————–
  I have no crystal clear answer.So i can keep on thinking with different standpoints.At least, from my own experience.
  —————————————
  ఒక పువ్వుకి వాసన ఉండటం ఎలా సహజమో నాలాంటి కొందరికి కొన్ని ఆలోచనలు ఉండటం సహజo. STOP there. Do not question.
  Advaitaa is a pure logical shit. How much you read and understand its of no use because clarity and confusion will go hand in hand. Strictly speaking people are afraid of the clarity. Only thing is no need to understand and nothing to understand.
  ——————————————–
  I am under complete control of the nature. All actions are springing from the same source. But You are identifying that source with individual names like Rama, Krishna, Sankara, Ramana, Ramakrishana paramahamsa etc., including Jesus Christ. Whatever they say it becomes mantra and it effects human consciousness. Thats why all these gurus are remembered for centuries even if some of them never studied even upto 10th class.
  —————————————-
  There is no goal in life; only we have to play a role. This is what Krishna said in Gita. Am i not playing my role in His scheme?
  ———————————————-

  కట్టె విరగకుండా పాము చావకుండా సామేత లా లెవ్వా?

  అయినా నేను చెప్పే సమాధానాన్ని బట్టి మీరు నిజం ఎలా తెలుసుకుంటారు? సరే పోన్లెండి. మీ నమ్మకాలతో నాకేంటి గానీ, నేను హిందువుని. మీరంతా ఈ గడ్డమీద పుట్టిన ఎవరెవరిని ‘హిందువు’ అని భావిస్తున్నారో, అలాంటి హిందువుగానే పుట్టాను. కానీ నాలో హిందుత్వం లేదు. అందుకని ఈ నిజమైన హిందువుని మీరు గుర్తించలేకపోతున్నారేమో.

  మహేష్ అంటే నాకు ఇంతవరకూ సదభిప్రాయమే ఉంది. అందులోనూ సందేహపడాల్సింది లేదు. మార్తాండ నాకూ అర్ధం కాలేదు. కాకపోతే, అతని ఫ్రీ థాట్ ఫ్లయింగ్లో వెళుతూ కూడా, ఎందుకోగానీ తిరిగి కమ్మ్యునిస్టు గూటికే వెళతాడు. అందుకే ఆలోచనలో ఉన్న స్వేచ్చని చివరికి తనూ గుర్తించలేడేమోనన్నది నా అభిప్రాయం.

  అద్వైతం నాకు అర్థమయ్యింది. అనుభవం కాలేదు. ఒకవేళ అనుభవం అయితే, చివరికి వెనక్కి రావటం ఏంటన్నది మింగుడు పడలేదు. కాబట్టి మాయలో అర్ధమయ్యేది మాయే 🙂 అందుకే ఇప్పుడిప్పుడే నాకై నేనే అద్వైతాన్ని సరి కొత్తగా తెలుసుంటున్నాని అనిపిస్తోంది. అందులో మాయ అనబడే మాయేంటో తెలిసినట్టే ఉంది. Ofcourse, there are no out of body experiences -Yet.

  Let me give one familiar name:”Ramakrishna Paramahamsa”. Vivekananda and his friends clearly believed him to be Avatara. Do you see anything that i speak different from them, Except the fact that i have no experience! Why do you have the confusion that i am an enemy? And in the first place how can you have an enemy except otherwise we are vying for something that only one of us is bound to get! God is for everyone – including me, you or Ravana – the rakshasa. Can’t you see that!?

 3. Snkr Says:

  అద్వైతం, సనాతనం, హైదవం, వేదాతం మీద మీ ఆసక్తి అభినందనీయం. మీ ఉద్దేశ్యం ఏదైనా, పాలను నీళ్ళనుంచి వేరు చేస్తుందని భావినే రాజహంసలా, విజ్ఞులైన బ్లాగరులు అక్కడక్కడ మీరు చేసిన అసందర్భ, వెగటు కామెంట్లను వేరు చేసి విషయాన్ని మాత్రమే గ్రహిస్తారులేండి.
  మంచి సమాచారం అందించారు, మీ ఆసక్తి అభినందనీయం. Keep posting such info, some decent bloggers may be interested.

 4. Snkr Says:

  అద్వైతం, సనాతనం, హైదవం, వేదాతం మీద మీ ఆసక్తి అభినందనీయం. మీ ఉద్దేశ్యం ఏదైనా, పాలను నీళ్ళనుంచి వేరు చేస్తుందని భావించే రాజహంసలా, విజ్ఞులైన బ్లాగరులు అక్కడక్కడ మీరు చేసిన అసందర్భ, వెగటు కామెంట్లను వేరు చేసి విషయాన్ని మాత్రమే గ్రహిస్తారులేండి.
  మంచి సమాచారం అందించారు, మీ ఆసక్తి అభినందనీయం.

 5. rayraj Says:

  @sri:
  Ok. But just 2 questions and 3 observations.

  1.I felt you were in sync with the spirit of my posts earlier.Why did you give the sudden derogatory remark?
  2.Taken aback, I gave my reply. Now,u gave a normal comment and i liked it as well.But why are you asking me not to write these? You said you don’t want me to be such n such – but the why? aspect is not clear to me.

  ————–

  1.Just the same way as అద్వైతం అర్థం కావడమనేది ఎమీ ఉండదు , there is no “అద్వైతం మీద బురద చల్లడ” as well. Else, both are there in their relative terms. That is the reason I can understand the earlier comment to be a derogatory remark and you too are aware it is meant to hit me.

  2.మనసు ఎంత ఊగిసలాటగా ఉంట్టుందంటే – “తీరా నా ప్రార్ధన ను కటాక్షిస్తావేమోనని వొణికిపోతాను.”
  -yes.I ve gone through this.But జ్ఞానోదయం – nothing of that sorts which is generally claimed.

  3.My life is entrenched in the normal life only.I have stronger “Moham” towards my family than the money aspects. Ofcourse, I desire money due to this “Moham”. Secondly, I can not take physical strain.So, i need money /help of others. Otherwise, in matters of money, I am sort of non-attached – like His attitude towards the temple building.I remain stingy by not keeping anything to myself 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: