ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం

న్యూజింగ్స్ మనోహర్ కామెంటు వల్ల, బ్లాగ్లోకుల్లో అద్వైతంపై అవగాహన సరిగా లేదన్న అభిప్రాయం/అపోహ నాలో కలిగాయి. మనోహర్‌కి ఏమీ తెలీదని కాదు. ఎంతో కొంత తెలుసన్న అంచనా/ఆశలతోనే, ఆ అభిప్రాయం కలిగింది. కొంత మేరకు క్లారిటీని పెంచాలనీ, ఈ తరంలో కొందరికి ఆసక్తి కలిగించాలనే డైరెక్టుగా అద్వైతం అంటూ రాశాను. నేను ఆసక్తి కలిగించే ఈ విధానం అందరికీ రుచించదు. ఐతే, ఏదో “మనం దీన్ని గౌరవించాలి కదా” అన్నభావనతో ఉంటే, విషయం రొడ్డుకొట్టుడుగా మారుతోందే తప్ప, ప్రాక్టికల్ సిగ్నిఫికన్సు ఏమీ మిగలదు. [అందుకే మనోహర్‌ని  ’చిలకపలకుల మనోహర్’ అని పిలుచుకుంటున్నాను]

ఐతే, ’శ్రీ’ అనే వ్యాఖ్యాత సరిగ్గా ఇలాగే నా గురించి భావించారు. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పి, రిఫరెన్సెస్ ఇచ్చి, సెలవు తీసుకున్నారు. అందులో కొన్ని పేర్లు నేను ముందు విన్నవి. ఆసక్తి లేనివి కొన్ని, ఉన్నవి కొన్ని. దీనివల్ల, ఆ ఆసక్తి ఉన్నవిషయాలని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాననే నేనుకుంటాను. వారి ఉద్దేశ్యం కూడా అదే అయి ఉంటుంది. 

అలాగే, నా బ్లాగు పాఠకులైనా కదా!
————————————————-

I am highly skeptical about these out-of-body experiences. But i can not rule out such possibilities. It is claimed that its beyond the intellectual plane. Fine! In such case, it interests me only to a point of intellectual understanding. But, why I am not ruling it out? That’s a subject matter on its own and there is lot of intellectulising about it too. ఈ పేరా తెలుగులో చెప్పటం రాలేదు.అనువదించే ఓపిక, సమయం లేవు.

ఏదేమైనప్పటికీ, ఈ విషయాల మీద కొంత అవగాహన కలిగి ఉండటం మంచిది. మనని ఫనెటిక్స్‌గా తయారు చెయ్యకుండా దోహద పడగలదు. [మనం ఫనెటిక్స్ ఎందుకు అవ్వకూడదూ? అవ్వచ్చు. కొందరు ఔతారు. అదీ నిజమే. కానీ కొందరు అందులోనించీ బయట పడతారు.]

మొన్నోసారి చెప్పుకున్నట్టు, సమాజం మారాలి అని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ ఏ దిశలో మారాలి? ఎలా మారాలి? అది ఎలా ఉండాలి? అన్న విషయాల మీద అందరం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. అసలు రాలేం కూడానేమో. ఐతే, కొంత అద్వైత రచనల్లో – ’మార్పుని సాధించటం అనేది ఏమీ లేదు’ – అనే ధోరణి ఉంటుంది. అదీ నిజమేననిపించే సన్నివేశాలు కూడా మనకు జీవితంలో తారసిల్లుతుంటాయి. కానీ, ఇక్కడే ఓ పారడాక్స్ ఉంది. అదే నిజమైతే, శంకరుడు మనకి ఇంత రెవల్యూషనరీగా ఉండడు. ’ఆయన కృపేగా ఇది’ అని అనిపించుకొనే కార్యాలేవి చేసి ఉండడు. కానీ, ఆయన చేశాడు. మార్పు సాధించాడు! సరిగ్గా గమనిస్తే, the same thing is at work everywhere. శంకరుడికి ముందు, బుద్దుడు కూడా అలాగే మార్పు సాధించాడు. [శంకరులు బుద్దుడూ మార్పు సాధించారా?లేక వాళ్ళ తదనంతరం జనాలు సాధించారా?ఇంకేమన్నా జరిగిందా? లాంటి చారిత్రక ప్రశ్నల మీద కూడా ఆలోచించవచ్చు. కానీ ఇప్పటి నా పాయింటు అది కాదు.  ఇతిమిద్ధంగా వీళ్ళే ఆ మార్పు సాధించారు అని చెప్పుకున్నా, వీళ్ళవల్ల మార్పుకు మార్గం సులభమయిందని రాసుకున్నా, విషయం ఒకటే నన్న ఓ అవగాహన ఉండటం అవసరం.] అప్పటి శంకరుడు వాదించాడన్నా, బుద్దుడు వాదించాడన్నా, సోక్రటీస్ వాదించాడన్నా – అందరిలో కనీసం మార్పు కోసం వారు చేసిన “వాదన” / “ఆలోచన” అన్న ఏకత్వమైనా మనం దర్శిస్తాం కదా!

డిస్పాషనేట్‌గా చూస్తే, ఎన్నో కారణాలు కలిసి రావడం వల్లో, అదృష్టంవల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు కనిపిస్తుంది. డిస్పాషనేట్ అని ఎందుకంటున్నాను? కొందరికి గాంధీ వల్లే స్వాతంత్ర్యం వచ్చినట్టు ఉంటే, కొందరికి కాంగ్రెస్ వల్లే సాధ్యమయ్యింది అనిపిస్తుంది. మరికొందరికి, కాంగ్రెస్‌లో దాక్కున్న కమ్యునిజం వల్లే ననిపిస్తే, మరికొందరికి ఆజాద్ హింద్ ఫౌజ్ వల్లే వచ్చిందనిపిస్తుంది. ఇంకో పిట్టకథలో, కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులైన హ్యూమ్స్‌‌కి, భారతీయ ఋషుల అతీంద్రియ శక్తుల మీద నమ్మకం ఉంది. అలాంటి ఋషుల ప్రోద్బలం వల్లే కాంగ్రెస్‌ని ఏర్పాటు చేశాడు. అది నమ్మితే, కాశ్మీరులో ఇప్పటికీ కనిపించకుండా తిరుగాడే, అతీంద్రియ శక్తులున్న సన్యాసులవల్లే, మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు! లేక – హ్యూమ్స్ ముఖాన్ని ముందుకి చూపిస్తూ, బ్రిటీష్ ప్రభుత్వం నుంచి డైరెక్టు యాక్షన్ తప్పించుకొని, కాంగ్రెస్‌ని మనగలిగేలా చెయ్యాలన్న మేధావుల వల్లే, కాంగ్రెస్ పుట్టి, స్వాతంత్ర్యం సమరంలో ముఖ్య భూమిక నిర్వహించి ఉండొచ్చు. ఏ ఒక్క కారణాన్నో పట్టుకొని, దానివల్లే జరిగిందని ఎలా చెప్పగలరు చెప్పండి? దీనికి పూర్తి యాంటీగా, అసలు బ్రిటీషు ప్రభుత్వమే కుట్రతో కాంగ్రెస్‌ను పుట్టించింది అని వాదించిన వారూ ఉన్నారు – రాజకీయంగా, కాంగ్రెస్‌పై బురదజల్లవలసి వచ్చినరోజు! సో, డిస్పాషనేట్‌గా అంటే? ఏ ఒక్కదానిమీదో రాగం పెంచుకోకుండా, దేని మీద ద్వేషం పెంచుకోకుండా, సమదృష్టి కలిగి అని. Is that familiar language to you now? కానీ, ఇది పూర్తిగా బాహ్యజగత్తుకు సంబంధించిన విషయమే. ఇందులో, ఎటువంటి మిస్టికల్ విషయమూ లేదు. ఔనా?

పడిగట్టుపదాలుగా, చిలకపలుకలుగా మనం మాట్లాడటం దండగ. దండగంటే? చిలకపలుకులు పలుకుతున్న వ్యక్తికి, ఆ పలుకులతో ఏమీ ఒరగదు. కానీ, in a grand scheme of things, perhaps, even those words are ‘working’. Who knows?

దేశాన్ని, దేశభక్తిని తయారుచేస్తారు. ఆ అవసరం ఎవరిది? వారెందుకు తయారు చేస్తారు? 
ఉదా: కేసియార్ తెలంగాణాని ఎందుకు తయారు చేస్తున్నట్టు? కెసియారు తయారు చేస్తే తెలంగాణా వస్తోందా? లేక తెలంగాణ ముందు నుంచి ఉన్నదేనా?. ఓ తెలంగాణ తల్లీ, ఓ తెలంగాణ సంస్కృతి అంటూ కొన్ని సింబల్స్ తయారు చేస్తున్నట్టుగానే, దేశమాత, దేశసంస్కృతి తయారైనాయా? లేక అలాంటి విషయం అసలు ముందు నుంచే ఉందా? ఇవన్నీ అసంబద్దమైన విషయాలు కాదు. Look at the symbols. మనం ఈ “దేశం” అన్న భావనని పెంపొందిచటానికి, ఓ జెండా, ఓ ఎంబ్లం, ఓ జాతీయ గేయం, ఇలా తయారు చేసుకున్నాం. సరిగ్గా, తెలంగాణ రాజకీయలకై,  మన ముందు అలాగే తయారౌతున్నట్టుగానూ, కనీసం కొందరం గుర్తిస్తున్నాం. తెలుగు తల్లితో సంబంధం లేకుండా, తెలంగాణా తల్లిని ప్రార్ధించవలసి వచ్చినా/ లేక ద్వేషించవలసి వచ్చినా, మన భావావేశాల్లో మార్పుని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ, సింబల్స్ యొక్క అవసరమూ, అవి సృష్టించే విభజనా రెండూ ఒకేసారి అర్ధం చేసుకోటానికి ఈ ఉదాహరణ ఉపయోగిస్తుందని ఆశిస్తున్నాను. ఇదే రకంగా, అన్ని రకాల సింబల్స్‌ని పిడిదెబ్బలతో  పిండి పిండి చేస్తే, ఆ సింబల్స్ యొక్క అవసరమూ, అడ్డంకీ రెండూ అర్ధమౌతాయి. ద్వంద్వం నశించికుండానే నశించి – ఏకత్వం దర్శనమిస్తుంది. అప్పుడు సింబల్స్‌తో పనేంటి మీకు?

ఎనివే, ఇవ్వాళ శీర్షికలోని విషయం చాలా క్లుప్తంగా  చెబ్దామనుకొని కూడా చాలానే రాశాను. ఈ క్లుప్తమైన వివరణ, ఓ పురాణశ్రవణంలో చెప్పగా విన్నాను. నాకు నచ్చింది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజిలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన(చేస్తున్న!?)  ” టికేవి రాఘవన్” అనే ఆయన ఇలా చెప్పారు:

ద్వైతం అంటే? – భగవంతుడు, భక్తుడూ విడివిడిగా ఉండటం.
తల్లి దగ్గర కూర్చొని ఆడుకుంటున్న పిల్లాడిలాగా.

విశిష్టాద్వైతం అంటే? – భగవంతుడులోనే రమించే భక్తుడు విడిగా ఉండటం.
తల్లి గర్భంలోనే ఉన్న శిశువు, విడిగా ఉంటూనే, తల్లిలోనే ఉన్నట్టుగా.

అద్వైతం అంటే? – “భగవంతుడు-భక్తుడు” అన్న సెపరేషన్ పోయి, ఒకటైపోవటం.
తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడు, తల్లికంటే భిన్నంగా ఉన్నట్టు కాదుగా.

ఇవ్వాళ్టికి ఇంతే నండి నా కోతిగీత 🙂 – If you enjoyed, do let me know. Your appreciation certainly makes me happy too 🙂

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

10 వ్యాఖ్యలు పై “ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం”

 1. anon Says:

  “I am highly skeptical about these out-of-body experiences. But i can not rule out such possibilities. It is claimed that its beyond the intellectual plane. Fine! In such case, it interests me only to a point of intellectual understanding. But, why I am not ruling it out? That’s a subject matter on its own and there is lot of intellectulising about it too. ఈ పేరా తెలుగులో చెప్పటం రాలేదు.అనువదించే ఓపిక, సమయం లేవు.”

  తెలుగులో ఆలోచించండి మాస్టారు, తెలుగులో ఆలోచించండి మాస్టారు అని అందుకే మొత్తుకునేది 😉

 2. sri Says:

  * ఆసక్తి ఉన్నవిషయాలని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాననే నేనుకుంటాను.*
  మంచిది కాని తెలుసు కోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. తెలుసుకొనే కొద్ది ఎంతో మిగిలి పోతూనట్టూనిపిస్తుంది. కనుక మీకు అసలికి నిరంతరం భాదించే ఏమైనా ప్రశ్న ఉందా? అనేది విషయం.
  —————————————————–http://gurivindaginja.blogspot.com/2011/02/blog-post_09.html

 3. sri Says:

  *ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం*

  నా వరకు పై మూడు ఒకటే. నా కోణం నుంచి చూడండి. మీరు ఈ టపా రాశారు. నేను చదివాను. దాని అర్థం మనం ఒకరి భావాలు/అభిప్రాయాలు తెలుసుకొన్నం అన్న మాట. దానికి ఆధారం భాష మీ టపా చదివిన తరువాత (భాష నాధారం గా చేసుకొని )నాకు ఒక విషయాన్ని చూసే విషయం లో మార్పు వస్తుంది. అంతే. అంతకు మించి ఎమీ జరగదు.language is nothing but logic. There is no start and end to logic. Do we know origin of logic? When it started ? మన ఆలోచనంతా కూడా భాష నాధారం చేసుకొని ఉంట్టుంది. ఒక ఆలోచన తరువాత ఇంకొక ఆలోచన, ఒక ప్రశ్న తరువాత ఇంకొక ప్రశ్న అలా కొన సాగుతునే ఉంట్టుంది. మీరు చెప్పిన పైమూడు ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం కూడా చదివిన వారికి నాలేడ్జ్ గా మారుతుంది. This same knowledge separate from your true nature.
  అద్వైతం అనేది ఆస్థితి లో ఉన్న వారికి తప్పించి మిగతావారికి ఉండదు. ద్వైతం, విశిష్టాద్వైతం కాన్ సెప్ట్స్ మాత్రమే. ప్రపంచం లో అందరు ఉండేది ద్వైతం(నాలేడ్జ్) లోనే. నేను/ నాదేహం అనేది కూడా నాలేడ్జే కదా!


 4. ఆత్మజ్ఞానము నిలో ఎంతవరకు సఫలమైనదో గ్రహించనెంచి ప్రశ్నించినపుడు సమాధానము: నీకిక చెప్పవలసినది ఇంకేమియును లేదనెను.జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను. శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర ధ్యాస వచ్చినచో నీవు వేరు, భగవంతుడు వేరు. ఆత్మ జ్ఞానంతో అతడే నీవు. చూచేవాణ్ణి చూడ నేర్వాలి. అప్పుడు సమస్యలన్ని మాయమగును. నాది అన్నపుడు నీవు, శరీరం వేరే అవుతుంది. అలాగే నా శరీరం అన్నపుడు నీవు శరీరం కాదు. నీవు వేరే, శరీరం వేరేయని అర్ధం. నా ఇల్లు అన్నపుడు నేను ఇల్లుకాదు. ఇల్లు నాకు వేరుగ యున్నది. అట్టి నీలో వైకుంఠం, కైలాసం, స్వర్గం, ముక్తి, మోక్షం, బ్రహ్మ, వైకుంఠపురం నీలోనిదే.చూచే నేనును చూచేవారు ధన్యులు. నేనును (శరీరం) చూస్తూ అసలు ‘నేను’ను విస్మరించరాదు. శరీర భ్రాంతిని వీడి నా ‘నేను’లోమనస్సు నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది. ఆధ్యాత్మిక జీవనమును కోరక తప్పదు. ప్రతి జీవి ఘనీభ వించిన మోక్ష స్వరూపమే. కాల పరిపాకమున ప్రతి పిందె కాయగ, పండుగ మారగలదు. పామర చిత్తులే పూత. ఫరిపక్వ హృదయులే ఫలములు. లేవండి! అలౌకిక దైవరాజ్యమును వెదకండి. అది బయట లేదు. మీలోనేగలదు. ఆత్మ విశ్వాసులై అఖండ దైవ సామ్రాజ్యమును మీలోనే స్వస్వరూపముగ దర్శించనేర్వండి.సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, , మాతలను, సమస్త దైవావ తారముల ఏకావస్ధలో, ఏకాత్మస్ధితిలో నిలిపి గాంచినపుడే నీ నిజస్వరూ పం బట్టబయలుగ గ్రాహ్యమై అనుభూతి కాగలదు. మనసు చైతన్యమై, పరిపూర్ణమైన బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మానసమే పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో సుషుప్తి అనుభవమే సమాధి. నేను అనే మనసు మూలంలో అణగిపోయినపుడు ఎంతకాలమైనా ఆత్మయొక్క అవిచ్చిన్న పరిపూర్ణ ఆనందమును అనుభవించవచ్చు

 5. Vikram Says:

  రేరాజు గారు,
  రేరాజు గారు, మానవ శరీరం పంచభూతాలతో నిర్మిత మైనదని చెపుతారు కదా! అది నిజమేనా? కొంచెం వివరించండి.


 6. //అద్వైతం అంటే? – “భగవంతుడు-భక్తుడు” అన్న సెపరేషన్ పోయి, ఒకటైపోవటం.
  తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడు, తల్లికంటే భిన్నంగా ఉన్నట్టు కాదుగా.//

  This is sheer logic. But logic itself is not philosophy.

  పిండం ఏర్పడడానికి తండ్రి వీర్యం కారణం. తండ్రి యొక్క అస్తిత్వం తల్లి నుండి వేరుగా (భేదంగానే) ఉంది. వారిద్దరి శారీరిక కలయికలో కూడా ఎవరి స్థాయీ భావాలు వారివిగానే ఉన్నాయి. సుఖాలలో తేడాలున్నాయి. అలానే పిండం ఏర్పడినప్పటి నుండీ దానికి తనదైన అస్తిత్వం ఉంది. భౌతికమైన రూప భేదాలు, అతీంద్రియమైన గుణ భేదాలున్నాయి. ఈ భేదాలు స్థూలమూ, సూక్ష్మమూ కూడా.

  సమస్తమైన ఆలోచనా సరళకి ఆధారమైన మనసులోనే నాలుగు ప్రకారాలున్నాయి (మనసు, బుద్ధి, చిత్త, అహంకార). దానికి చేతన (జీవి) జత చేరితే అదే అంతఃకరణ పంచిక.

  ఇలా సర్వం భేదాత్మకమై, ఆశ్రయ-ఆశ్రిత భావాలతో ఉన్నాయి. ఈ భేదం కేవల భౌతికం కాదు. ఐంద్రికమే కాదు. అతీంద్రియం కూడా.

  “ప్రపంచ” మంటే ప్రభేద పంచకంతో కూడినది. ఆ ఐదు భేదాలేవంటే:

  జీవ-జీవ, జీవ-జడ, జడ-జడ, ఈశ-జీవ మరియు ఈశ-జడ

  “జీవేశ్వర భిదా చైవ జడేశ్వర భిధా తథా
  జీవ భేదో మితశ్చైవ జడ జీవ భిధా తథా
  మితశ్చ జడ భేదోయం ప్రపంచో భేదపంచకః”

  అన్న పరమోపనిషత్ వాక్కులు ఆధారం.

  మోక్షంలో కూడా భేదముంటుంది. అది జ్ణానాత్మకం. ఒక ముక్తజీవి ఆనందం మరో
  ముక్తజీవి నుండి భిన్నం. ఈ భిన్నత్వానికి కారణం జ్ణానంలోని సూక్ష్మ భేదాలు.

  “న హి జ్ణానేన సదృశం”

  నమస్తే!

 7. rathnamsjcc Says:

  The goal is to realize the ultimate truth

  Every man achieves the ulitimate realization from his physical body or state and this is one achievement which cannot be measured nor can ever be imagined. This force or energy is greater than the power of prana , mind ,the blissful state experienced by mind.once an individual goes deeper into spirutuality he comes to a conclusion that it is thou and not thy who is the real form. Once we experience this state we come to a conclusion that I am an orphan yet I have everyone.
  I have no father,mother, no form , or physical existance. I am the supreme light the adichaitanya the supreme TEJAS!!!
  This is the state of complete zeroness , where it is compared to the state of god or samadhi. Here an individual atman becomes onje with the supreme paramatman
  The soul is beyond comparision of length, breast and height and time. The vedas and upanishads are not able to describe the real starte af atman. It is niether a scientific nor religious in nature. it is nither matter, compound element or atom , since it is smaller than an atom and but greater or larger than the entire planetary system. It is above any of the 5 elements and can never be persued by the 5 senses or panchendrias. Nither the gods nor the devils have known the real nature of atman.
  Then an individual will only see the real atman or supreme brahman supreme effulgence and creator of the universe ,shiva , hence forth he becomes the controler and creater of this universe and away from nature law, is nither in an animate or inanimate state what everyone call as god. telugu

 8. bharati Says:

  TKV Raghavan gaaru maa kazin . meeru aayana daggara chadivaaraaa? cool!

 9. rayraj Says:

  @bharati:లేదండి. ఆయన పురాణప్రవచనాల్లాంటివి చేస్తుంటారు కదా. టివిలో కూడా చెబ్తుంటారు కదా. అంతే. మాకు పరిచయం లేదు. ఆయన చెప్పిన తీరు నచ్చి వాడుకుంటున్నాను. దీని పొడిగింపు, నెక్స్టు పోస్టుల్లో ఉంది. చూడగలరు.

 10. rathnamsjcc Says:

  మానవ శరీరం పంచభూతాలతో నిర్మిత మైనదని చెపుతారు కదా! అది నిజమేనా? కొంచెం వివరించండి.
  ఇట్లు పంచభూతములుగల్గెను. పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంబు లను నీ పంచభూతములచే శరీరంబాయెను. ఈ పంచభూతంబులు వేరు వేరుగా విభజించబడుటయే పంచీకరణం బనబడును. అది యెట్లన –
  మనోబుద్ధి చిత్తాహంకారము లనెడు అంత:కరణ చతుష్టయము నాకాశంబుచే గల్గెను.
  సమానవ్యాన ఉదాన అపాన ప్రాణంబులనెడు పంచ ప్రాణంబులు వాయు భూతంబులచే గల్గెను.
  శ్రోతము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణంబులనెడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంబు లచే గల్గెను.
  శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనియెడు పంచతన్మాత్రలు జలభూతంబులచేగల్గెను.
  వాక్కు, పాణి, పాదము, గుదము, గూహ్యంబు లనెడు కర్మేంద్రియంబులు పృధ్వీభూతంబుచే గల్గెను.
  ఈ పంచభూత పంచతన్మాత్రలు పంచీకృతంబులైన సకలేంద్రియంబులును. తదీయ వికారంబులు, సత్వ రజోతమంబులనెడు త్రిగుణంబులును, స్థూల, సూక్ష్మ కారణ శరీరంబులును, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యంబు లనెడు అరిషడ్వర్గంబులును వీటి యన్నింటితోనుండెడు ‘జీవుం’డను కానని విక్షేపావరణంబును త్యజించి తనకు తానై తరచి విచారించి మున్ను జెప్పబడిన భూతాది వికారముల మీద తాను శేషించి యచలుడై యుండుటే సాంఖ్యమనంబడును, అనగా పంచవింశయుతండైన జీవుండు ఆ జీవుని యెరుంగుటే ఆత్మయనంబడును. ఆ యాత్మ వలన పరమాత్మనుగనుగొనినపరబ్రహ్మంబొక్కడే నిలుచునని తల్లికి నీ సాంఖ్యసూత్రం బెరిగించగా నంత తల్లియైన వీరపాపమాంబ సంతోష స్వాంతయై ‘బిడ్డా! ఆ పరబ్రహ్మంబును కనుగొను నుపాయంబును దెల్పు’మనగా నంత వీరంభొట్లయ్య ‘తల్లీ! ఇంక నా పరబ్రహ్మంబును నెరుంగు సాధనంబులను దెల్పెద. సావధానచిత్తవై విను’మని ఇట్లనియెను. (సిద్దయ్యగారికి బోధించిన సాంఖ్యంబును చూడుడు)


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: