మనోహరా! ’మోక్షం’లోనూ ’భిన్నత్వం’ ఉందిట!

’శ్రీ’ గారు నయం. మూడూ ఒక్కటే నన్నారు. వీరెవరో రఘోత్తమరావుగారట, మోక్షంలోనూ భిన్నత్వం ఉందన్నారు చూశారా? సరిగ్గా నిన్నటి పోస్టు ఇలా పబ్లిష్ చేశానో లేదో, అప్పుడు చూశాను, వారి కామెంటు. కనీసం ’శ్రీ’ గారు ఇదంతా ఇంటేగ్రేషనే అని చెప్పటానికి వస్తే, వీరేమో ఇదంతా డిఫరెన్షియేషనే అంటున్నారు.

వీళ్ళ ’జ్ఞానం’ చల్లంగుండ, ’మోక్షం’లోనూ ’భిన్నత్వం’ ఉందిట. మనం ఎందుకు ఆనందిచాలో తెలుసా?  గుడ్డిలో మెల్ల –  “దేవుడు ఒక్కడు కాదు” అన్లేదు, బతికిపోయాం! హ హ హ :))

ఇంతకీ మీ భిన్నత్వానికి ఏం ఢోకా లేదని ఇప్పటికైనా నమ్ముతారా?అందరకీ దక్కేది ఒకే పరమపదం కాదు ట! మోక్షంలోనూ భిన్నత్వం ఉంది ట! గట్టిగా మాట్లాడదామా అంటే, ఉపనిషత్తులు కూడా కోట్ చేస్తున్నారాయే. ఏంటి భయపడి వెనక్కి తగ్గుదామా లేక – అంతా ఒక్కటేనిని గట్టిగా వాదిద్దామా?

మీరు సాఫ్టువేర్ ఇంజనీర్ అని, మీరేసిన పోస్టుల్లో ఎక్కడినుంచో ఊహిస్తున్నాను. ఎందుకు చెబ్తున్నానంటే, సాఫ్టువేర్‌ ఉద్యోగం అంటే, చాలా ఇంటలిజెంట్ అయ్యుంటారు కదా. నేనేమో కాస్త ’తక్కువ’ తెలివిగలవాడిని. ఎందుకైన మంచిది, “అంతా ఒకటే” అని నేను వాదించటంలో ఓడిపోకుండా, మీరు కూడా కాస్త నాకు దన్నుగా నిలబడాలి మరి! ఆ!

—————————————–

x = జడ; ఓ రెండు జడలు (అమ్మాయివి కాదండి) :  లైక్,   బంగారం- రాయి; చెక్క-మట్టి.
y = జీవ; ఓ రెండు జీవాలు; లైక్, మీరు-నేను; మనిషి – జంతువు;
z = ఈశ; అదేలెండి ఓ దేవుడు

ఇప్పుడు ఎన్ని కాంబినేషన్లెయ్యొచ్చు : xx, xy(yx), xz(zx), yy, yz and zz.  మొత్తం ఆరు భేదాలు- తన్నుకు చావటానికి.

oops! ఇక్కడో చిన్న విషయం. రెండు దేవుళ్ళు లేరుగా! అందుకని zz  రూళ్డ్ ఔట్. సో, ఉన్నవి ఐదే!

xx , xy, xz, yy and yz 

జడ-జడ , జడ-జీవ, జడ – ఈశ, జీవ – జీవ, జీవ – ఈశ ;

మ్…హు వారి ఆర్డర్ లో పెడదాం. క్లారిటీకీ.

జీవ-జీవ, జీవ-జడ, జడ-జడ, ఈశ-జీవ మరియు ఈశ-జడ

ఇదేంటోయ్! ఇంత లాజికల్‌గా ఉన్న విషయాన్ని పట్టుకొచ్చి, ” This is sheer logic. But logic itself is not philosophy.” అంటూ, మనమేదో లాజిక్కుల్లో చచ్చే పురుగుల్లా, వారేదో అంతగంటే గొప్ప విషయం తీసుకొచ్చినట్టు మాట్లాడారు!?

పైగా –

“జీవేశ్వర భిదా చైవ జడేశ్వర భిధా తథా
జీవ భేదో మితశ్చైవ జడ జీవ భిధా తథా
మితశ్చ జడ భేదోయం ప్రపంచో భేదపంచకః”

అన్న పరమోపనిషత్ వాక్కులు ఆధారం.

అంటూ బహు గంభీరంగా మనలని భయపెట్టారు. దీనికి ఉపనిషత్తుల తోడెందుకు? సొంతగా డెడ్యూస్ చెయ్యలేమా?

అందుకే మనోహరా! నే చెప్పేదేంటంటే – ఈ గోల చచ్చిపోయినా, మనకి కావల్సింది మనకు దొరుకుతుంది. “నువ్వే దేవుడ”ని ఋషులు చెబ్తుంటే, మీరు కనీసం  ఋషులవ్వడానికి సైతం భయపడితే ఎలా? ప్రయత్నించకపోతే ఎలా?

సరే, వీళ్ళతో ఇంకా టైం వేస్టు చేసుకుందామంటారా? బట్ యూ నో సంథింగ్, మనం టైం వేస్టు అనుకుంటే, అందరినీ ఎలా కలపుకుపోగలం? ఇంటేగ్రేషన్ ఎలా సాధించగలం? పైగా, ఇలా కలుపుకోకుండా, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తే, రేపు ఇదే “వివక్ష” అయి కూర్చోవచ్చు. ఓ పని చేయకూడదు…..మీరు కలుపుకు రాకూడదూ? ఏమంటారు?

————————–

అన్నట్టు, ఇదంతా పెర్ముటేషన్సు కాంబినేషన్సుల సింబల్స్ – nPr, nCr లలో ఎలా చెప్పాలి? సూపర్ స్క్రిప్టు, సబ్ స్క్రిప్టు ఎలా రాయాలి? కొంచెం చెప్పరూ…ప్లీజ్.

అలాగే ఎవరన్నా కాస్త ఓపిక చేసుకొని, ఈ శరీరం పాంచ బౌతికమెలాగయ్యిందో, ఆ తర్వాత ఇంకా “ఎన్ని” అయ్యిందో ఎవరన్నా ఆ కుర్రోడికి చెప్పండయ్యా. పెద్దాయానెవరో పీరియాడిక్ టేబుల్ దాకా రాసినట్టు గుర్తు. కాస్త చూసి, అటు పంపియ్యండయ్యా…మీకు పుణ్యం ఉంటుంది!


ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

6 వ్యాఖ్యలు పై “మనోహరా! ’మోక్షం’లోనూ ’భిన్నత్వం’ ఉందిట!”

 1. vikram Says:

  మనోహర్ ఎవరు? మీ అసలు పేరు మనోహరా? ఇంతకి మీరు ఏ ఊరిలోఉంటారు? మీ కులమేమిటి? ఇటువంటి పైసా డబ్బులు రాని వాటి మీద చర్చించే వారు బ్రహ్మణులు లేక పోతే దళితులు ఎక్కువగా ఉంటారు. ఒకరికి ఇలా ప్రశ్నలు వేసుకొంట్టూ నాలేడ్జ్ ని పోగేసుకొంట్టూ ఉంటారు దానిని వారు మాను కోలేరు కొన్ని తరాలుగా అలవాటైయింది. ఇక దళితులు వారు చదువు కునే సమయం లో పుస్తక జ్ఞానం ద్వారా తమకు జనబలం ఉన్నదని దానిని సమీకరిస్తే అధికారం చేపట్టగలమని అనుకొంటారు. సమీకరించ టానికి తగినంత డబ్బులు ఆ చదువుకొనే వయసులో ఉండవు కనుక సామాజిక అవగాహన కలిగించే విధంగా రాయటం మొదలు పెడతారు. అది అలవాటుగా మారి అలా రాస్తునే ఉంటారు, ఉపన్యాసాలు ఇవ్వడం కూడా ఈ మధ్యలో అలవాటు అవుతుంది. ఊరూరు తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చుకొంట్టూ,పుస్తకాలు రాసుకొంట్టు ఆఖరుగా రాజకీయనాయకుడు కావలసిన వారు మేధావిగా తయారౌతారు. ఏప్పుడైనా రాజకీయ మార్కేట్లో కొత్త పార్టి పెట్టినపుడు చిరంజీవి లాంటి వారు ఈ మేధావులకు తగినంత సొమ్ము/అధికారం ఇస్తామని టోకున కొనుకుంటారు. కాని మన సిరంజీవి కాంగీలో చేరి అందరి ఆశలను వొమ్ము చేయటమే కాక ఇటువంటి మేధావులను కూడా వంచించాడు. సమీప భవిషత్తు లో మేధావులకు పెద్ద డిమాండ్ లేదు. 🙂

 2. vikram Says:

  డిమాండ్ లేని వాటి మీద చర్చించటం ఎంత వృధానొ తెలియని మీకు యం.బి.ఏ. చదువు చెప్పినది ఎవరు? How did you do MBA? from Which university you passed MBA? 🙂

 3. rayraj Says:

  :)) బాగా నవ్వించారు. మీ కామెంటుతో :). మామూలుగా ఐతే, నన్నిలాంటి ప్రశ్నలేస్తే నాకు చిరాకు. కానీ, మీకు పూర్తిగా నా బ్లాగు పరిచయం లేదేమో, అందుకని చెప్పటంలో తప్పులేదు. చాలా రోజుల క్రితమే, ఇన్ని రాతల మధ్యలో ఓ మూడు విషాయాలు చెప్పాను.

  ౧. బహుశా నన్ను ఇంటెలెక్ట్యుయల్ అనొచ్చుగానీ, clever, intelligent, smart అన్లేరు.
  ౨. రేరాజ్ రాజకీయం చెయ్యడు
  ౩. సైకిల్ మీదనుంచి కిందపడ్డ పిల్లాడిని లేవదీసి, తన స్వాభావికమైన ప్రేమతో తిరిగి పిల్లాడిని సైకిల్ ఎక్కించే మనిషి ఓ మేధావి.
  [వాడికి సైకిల్ తొక్కడం రాకపోవచ్చు. వాడు కుంటివాడు కూడా కావచ్చు :)]

  నేను తెలుగుతో సంపాదించటం చేతకాని ఓ ’తెలుగువాణ్ణి’. ఇందులో వ్యాపారం చెయ్యాలన్నా, కొన్ని ఎన్విరాన్మెంటల్ మార్పులు కావాలని, నాకు MBA నేర్పింది. అంచేత ’తెలుగు’కి డబ్బు రావాలంటే, తెలుగుభాషలోనూ, తెలుగువారిలోనూ చాలా మార్పు రావలన్నది నాకర్ధమైంది. సాధారణంగా, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ మార్పులని, డబ్బు సంపాదించే వ్యాపారస్తులు, ప్రభుత్వం(ఇన్ టర్న్ రాజకీయం) ద్వారా సాధించుకుంటారు. కానీ, సమాజంలోనుంచే స్వాభావికంగానే మార్పులు వచ్చినప్పుడు, ప్రభుత్వాలు, వ్యాపారస్తులు వారి లాభాలు వారు చూసుకుంటారు.

  కాబట్టి, దమ్మిడీ ఆదాయం లేని ఈ రాతలు రాయటం నాకు MBA నేర్పలేదు. కానీ, సరిగ్గా మీలాగే భావించి, ఇలాంటి రాతలురాసే వాళ్ళని ఎండగట్టేస్తున్నాను. 🙂

  ఇక మీరడగిన మిగితా ప్రశ్నలకి నేను సమాధానం చెప్పను. ఒక్క విషయంలో క్లారిటీ ఇస్తాను.

  Ch. Monohar ఓ బ్లాగర్. ఆయన బ్లాగు :http://www.newjings.blogspot.com/. ఆయనకీ నాకూ మధ్య కొంత సంవాదం జరిగింది. ఇద్దరం ఒకటే చెబుతూకూడా, వేరు వేరు చెబుతున్నట్టగా మాట్లాడుకున్నాం, ఈ క్రింద పోస్టుల్లో :

  అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?
  “తిరుగులేని దేవుడు తిరుమలరాయడు”
  “ఇకడెవ్వరూ ఎవ్వరిని కలుపుకోలేదు …***య్ బే”

  And to me, Ch now stands for “చిలకపలుకలు”; ఆ చిలకపలుకలతో నా మనస్సును దోచిన మనోహరుడు. Thus, ’చిలకపలకుల మనోహర్’ stands as a symbol for people who are parrot-speaking.


 4. //దీనికి ఉపనిషత్తుల తోడెందుకు? సొంతగా డెడ్యూస్ చెయ్యలేమా?//

  అతీంద్రియ విషయాల్లో సొంతంగా డెడ్యూస్ చెయ్యలేము. ఎందుకంటే, మనుషుల్లో ఏ ఒక్కరికీ అన్ని విషయాలూ తెలియవు కనుక.

  మీరు ఎంబిఏ చదివారు కాబట్టి నాకంటే మీకు ఎక్కువ విషయాలు తెలిసివుంటాయి. ఆ విషయాలను మీరు పుస్తకాల ద్వారా, ప్రాజెక్ట్ వర్క్స్ ద్వారా బాగా అర్థం చేసుకునుంటారు. అధ్యాపకులు, నిష్ణాతులు చెప్పినదాన్ని శ్రద్ధగా వినివుంటారు. తద్వారా మీకో నిశ్చయమైన, ఖచ్చితమైన అవగాహన కలుగుతుంది. అదే “జ్ణానం”.

  ఆ జ్ణానంతో మీరు చెప్పిన విషయాలు నాకు అర్థం కాకపోవచ్చు. అలా అర్థం కానివన్నీ అబద్ధాలని నేను అనుకోవచ్చు. అసంబద్ధంగా వాదించనూవచ్చు. మీరు ఎంబిఏ చదవడం ద్వారా పొందిన అనుభవం నాకు లేకపోవడం ద్వారా ఇలా జరగవచ్చు. కానీ నా ప్రవర్తనతో సత్యమైన మీ జ్ణానానికి నష్టం లేదు.

  ఇలా లౌకికమూ, ఐంద్రికమూ ఐన అశాశ్వత విషయాలలోనే ఇంత తారతమ్యమున్నప్పుడు, అలౌకికం,అతీంద్రియం, శాశ్వతమైన విషయాలలో అంతరాలు ఎంత ఉంటాయో తెలుసుకోవచ్చు.

  మన జ్ణానం & అన్వయ శక్తి పరిమితం కాబట్టి అపౌరుషేయాలైన వేద, ఉపనిషత్తులను ఆధారం చేసుకోవాలి. “న చ కేవల తర్కేణ” అని ఋషులు చెప్పారు. అంటే ఆధ్యాత్మిక విషయాలను తర్కంతోనే అర్థం చేసుకోలేమని. నిజంగా తెలుసుకోవాలంటె “వేదాహ్యైనం వేదయంతి” అని (వేదాల ద్వారా తెలుసుకోవాలి)అన్నార్. ఎందుకు అని ప్రశ్నించుకుంటె “నేంద్రియాణం, నానుమానం” – నీ ఇంద్రియాలు మరియు తర్కం అల్పం, బలహీనం కాబట్టి అన్నారు.

  “అహం బ్రహ్మాస్మి” – “నేను బ్రహ్మనై ఉన్నాను” అని భగవంతుడు తన గురించి చెప్పుకొన్నది. జీవుల గురించి కాదు. భగవంతుడు అందరిలోనూ ఉండి (హృద్యేసార్జున తిష్టతి-గీత), నడిపిస్తాడు (యంత్రారూఢాని-గీత). అంటే ఒక్క జీవిని కూడా వదలి భగవంతుడు ఉండబోడు. ఇంతటి దగ్గరితనం ఉండడం వల్లనే మనిషి మనో ప్రవృత్తికి “అహం” పర్యాయ పదమైంది. కానీ జీవి ఎల్లఫ్ఫూడూ ఈశునికి దాసుడే.

  ఈశావాస్యమిదం సర్వం (అంతటా భగవంతుడున్నాడు), తేన త్యక్తేన భుంజీతా (భగవంతుడు ఇచ్చినదానిని అనుభవించు)అన్న ఈశోపనిషత్తు వాక్యాలు ఈశ-దాస భావాన్నే చెబుతాయి. భేదాలున్నాయనడానికి ఇవే ఆధారాలు.

 5. Ramgopal Says:

  కత్తి మహేష్ కుమార్ అంటున్నారు:
  ఫిబ్రవరి 24, 2011 వద్ద 7:45 పూర్వాహ్నం

  This is usual, Non-value addition.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: