ఎరెన్డ్ లీవ్ / ఆర్డినరీ లీవ్ / ఎన్‌క్యాషబుల్ లీవ్

ప్రభుత్వోద్యోగాల్లోనూ, కొన్ని ఇతర ప్రభుత్వరంగ ఉద్యోగాల్లోనూ ఎరెన్డ్ లీవ్/ఆర్డినరీ లీవ్/ఎన్‌క్యాషబుల్ లీవ్ లాంటి పేర్లతో ఓ రకం లీవులుంటాయి. ఇలాంటి లీవులని పోగేసుకోనిస్తారు. పోగేసుకున్న వాటిని ఎన్‌క్యాష్ చేసుకోనిస్తారు. ఒక ఏడాదిలో వాడుకోగలిగే క్యాజువల్ లీవులలో సైతం, వాడుకోకుండా మురిగిపోబోతున్న కొన్ని లీవులని ఈ లీవులగా మార్చి, ఎక్యుములేట్ చేసుకోనిస్తారు. ఇలాంటి సంచిత లీవుల మొత్తం ఫలానా సంఖ్యకంటే మించకూడదు అని కూడా నిబంధన ఉంటుంది.కొంత అటుఇటూగా ఈ లీవుల విషయం ఇలా ఉంటుంది:

ఉదా ౧:
సంవత్సారాదిలో కొన్ని ‘ఆర్డినరీ/ఎన్‌క్యాషబుల్/ఎరెన్డ్ లీవులు ఇస్తారు. ఉదా. ప్రతి ‘పది’ పని దినాలకీ, ఒక ఎరన్డ్ లీవు చొప్పున, మొత్తం ఓ ముప్పై (30) లీవులిచ్చారు అనుకుందాం. ఇందులో మీరు 20 వాడుకోకుండా మిగుల్చుకున్నారు అనుకుందాం. అప్పుడు, వచ్చే ఏడాదికిచ్చే ముఫ్ఫైతో వీటిని జత చేసి, మొత్తం సంచిత ‘ఆర్డినరీ/ఎన్‌క్యాషబుల్/ఎరెన్డ్’ లీవులు యాభైగా చూపిస్తారు.

ఉదా ౨:
పై లీవులు కాక, మీకు ఏడాదికి ఓ 10 క్యాజువల్ లీవులు కూడా ఉన్నాయనుకోండి. అందులో మీరు ఐదు లీవులను, ఎక్యుములేట్ చేసుకోవచ్చు అనేది ఓ నిబంధన అనుకుందాం. ఐతే, మీరు రెండే లీవులు వాడుకొన్నారు. ఎనిమిది లీవులు వాడుకోలేదు. ఐనా, ఐదు లీవులనే ఎక్యుములేట్ చేసుకోనిస్తారు. మిగిలిన మూడు లీవులు మురిగిపోతాయన్నమాట. పై ఉదాహరణకే ఇది కొనసాగింపు అనుకుంటే, ఇప్పుడు సంచిత ఆర్డినరీ లీవుల బ్యాలెన్సు = 55 అన్నమాట.

ఉదా ౩:
కొన్ని సంస్థల్లో ’కంపల్సరీ లీవు’ని అమలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది జనాలు అతిగా లీవులు పోగెయ్యటాన్ని నిరోధించటం కోసమూ, ఒకవేళ వాళ్ళ ఉద్యోగాల్లో చేయకూడనివి ఏవైనా చేసి కప్పి పుచ్చుతున్న పక్షంలో వాటిని బయటపడేసే అవకాశం కోసమున్నూ, ఉద్యోగులకీ ఒత్తిడి నుంచి కొంత ఊరటనివ్వటం కోసమూ, ఇలా పలు రకాల కారణాల రీత్యా, కొన్ని సంస్థల్లో ఈ ’కంపల్సరీ లీవు’ని అమలు చేస్తున్నారు. అంటే, ఏడాదికి ఓ వరుస పది రోజులు లీవు పెట్టి తీరాల్సిందే అనేది నిబంధన. (ఐతే, మొదటి స్టెప్పులోనే, పది లీవులు వాడుకున్నట్టు మనం లెక్కగట్టాం కాబట్టి, ఈ ఉదాహరణలో సంచిత ఆర్డినరీ లీవులు సంఖ్య 55దే ఉంటుంది)

ఇలా పోగేసుకోవటంలో ఏం లాభం? అదికదా అసలు విషయం. పేరులో ఉన్నట్టుగానే, ఇవి ఎన్‌క్యాషబుల్ లీవులు. అంటే, ఆ లీవులను వాడుకోకుండా, అన్ని రోజులకి జీతం పుచ్చుకోవచ్చు.ఈ విషయంలోని ట్రెడిషనల్ థింకింగ్ ఏంటంటే, ’ఎంత వీలైతే అంత పోగేసుకుందాం’ అని. పదవీ విరమణ సమయానికి ఉద్యోగి బేసిక్కులు, డియేలు ఎక్కువై ఉంటాయి కాబట్టి, అప్పుడు ఎన్‌క్యాష్ చేసుకుంటే, ఈ లీవులనుండి ఓ పెద్ద మొత్తాన్ని ఆశించవచ్చు.

కానీ, ఈ మధ్య ఇలా అనుకోలేకపోతున్నాం. ఎందుకంటే, అవ్వడానికి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులైనా, కాస్తో కూస్తో పురోగమించే లక్షణం ఉన్నవాళ్ళు, కనీసం ప్రభుత్వ సంస్థల్లోనైనా అటూ ఇటూ గెంతడాలు చేస్తున్నారు.

అలాంటప్పుడు, ఇలా ’పదవీ విరమణ – రిటైర్మెంట్ వరకూ పోగేసుకోవటం’ కుదరదు. కొన్ని సంస్థల్లో, రాజీనామా చేసిన వారికి, ఈ లీవులు పూర్తిగా మురిగి పోవటంగానీ, లేదా సగ భాగం మాత్రమే ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశంగానీ ఉండొచ్చు. అందుచేత, ఏ ఏడాదికి ఆ ఏడాదే, ఎంత వరకూ ఎన్‌క్యాష్ చేసుకోవచ్చో అంతా చేసేసుకోవడమే లాభదాయకం అని చెప్పుకోవచ్చు.

అలాగని, మనం ఖచ్చితంగా ఉద్యోగం మారతామని ముందే నిర్ణయించుకోనీ కూడా ఉండమే! పైగా, ఇలాంటి సంచిత లీవులని అత్యవసర/ఆరోగ్య విషయాల వల్ల లీవు పెట్టాల్సి వచ్చినప్పుడు సైతం వాడుకోవచ్చునాయే. అంచేత, ఎంతో కొంత ఎక్యుములేట్ చేసుకోవటం కూడా అవసరమే.

అలా జ్యూడిషియస్‌గా ఎన్‌క్యాష్ చేసుకుంటూ, పోగేసుకుంటూ రెండూ చేసుకుంటూ ముందుకు పోవలి. అలాగే, ’పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తాన్ని ఆశించి లీవులు పోగేసుకుంటారు’ అని చెప్పుకున్నాం కదా, ఆ లక్ష్యాన్ని కూడా వదులుకోకూడదు. ఇలా ఎన్‌క్యాష్ చెయ్యగా వచ్చిన డబ్బుని, అల్లాలు బెల్లాలుగా ఖర్చు చేసుకోకుండా, ఏదైన ఒక నమ్మకమైన ఎస్సెట్ క్లాస్ లో ఇన్వెస్టు చేసుకోవాలి. ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకోవచ్చుగానీ, దాని వల్ల వచ్చే రిటర్న్ అంత ఎక్కువగా ఉండదు. ఎంత ఎక్కువగా ఉండదు? పోగేసుకొన్న లీవులని చివరి బేసిక్కు డియేలతో జీతంగా పొందితే వచ్చేంత ఉండకపోవచ్చు. అందుకనే, ఆ మొత్తాల్ని తరగిపోని ఆస్థుల్లోకి మదుపు చెయ్యాలి.

ఇలా ప్రతి ఏడాది ఎన్‌క్యాష్ చేసుకొనే మొత్తం ఎక్కువ ఉండదు గాబట్టి, ఆ మొత్తంలో భార్యలకో / పిల్లలకో బంగారం కొన్నివ్వడం లాంటివి చెయ్యొచ్చు. లేదా పిల్లల పేర్లమీద ఓ పెద్ద మొత్తం ఇన్సూరెన్సులు తీసుకోవటం చెయ్యొచ్చు. (ఇన్సూరెన్సు ప్రీమియంలని మళ్ళీ ట్యాక్సు మినహాయింపుగా కూడా పొందచ్చు).

ఇక మీ దగ్గర ఇలాంటి చిన్న మొత్తాలతోనే అధిక లాభాన్ని (లాంగ్ టర్ములో ఐనా సరే) సాధించే ఐడియాలేమన్నా ఉంటే మీరు కూడా చెప్పొచ్చు.:)

————————————–
P.S.
౧. శరత్‌’కాలం’ పోస్టుల ప్రేరణతో….
౨. పర్సనల్ ఫైనాన్సు పై అజ్ఞానాన్ని బయటేసుకుంటూ….
౩. ఓ కుర్రాడికొచ్చిన అనుమానానికి ఈ విధంగా సలహానిస్తూ…
౪. ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఆశిస్తూ…
౫. వెనుకబాటుతనం నుంచి బయటేసే మదుపు ఐడియాలెవరైనా ఇస్తారిని ఆశతో….
6. మరో అరడజను ఆలోచనలతో…

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

4 వ్యాఖ్యలు పై “ఎరెన్డ్ లీవ్ / ఆర్డినరీ లీవ్ / ఎన్‌క్యాషబుల్ లీవ్”


 1. Nice Post. మీ టపాలో మరింతగా హైలైట్ చెయ్యవలసిన విషయం..

  “ఇలాంటి సంచిత లీవులని అత్యవసర/ఆరోగ్య విషయాల వల్ల లీవు పెట్టాల్సి వచ్చినప్పుడు సైతం వాడుకోవచ్చు”

 2. Anonymous Says:

  Un metured
  Half cooked knoledge
  Misleading
  At least try to know about what you are writing

 3. msraju Says:

  sir,
  your are not consider DAE employees. 30EL and 20HPL for year only . They can not reimbursement for en cashing leave until they were going to LTC. In DAE employees only 8 CL For entaire year. DAE is Govt OF INDIA Organisation. Please revise your post

 4. rayraj Says:

  Un metured అనరు
  Immature అంటారు

  Half cooked knoledge కంటే
  Half baked అంటారు

  Anyway I wan’t to know where I am going wrong. This is an advise given to someone and I don’t want to mislead him. I wanted to discuss and brought it on blog. Let us see what you have to say on this.

  @weekend politician: I highlighted now 🙂


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: