తింగరి వెధవల్లారా.. ఈ జాతిద్రోహులే మీకు కరెక్టు.

చాలా నిర్దిష్టంగానే చెప్తున్న పోస్టు. ఐనా అర్ధంగాకపోయినా /  చేసుకునే సహనం పోయినా, సైలెంటుగా దొబ్బెయ్యచ్చు.
_______________________

ఒక్కొక్క సింబల్‌ని పిడిగుద్దులతో పిండి పిండి చేసి, దాని వెనుక దాగున్న నిజాన్ని, సింబల్సు సృష్టించిన మేధావుల లక్ష్యాన్ని చూపించి, మన మట్టి బుర్రలో ఆలోచన మొలకత్తెంచాలని ప్రయత్నిస్తుంటే, మీకు ఆవేశమే వస్తోంది తప్ప, ఆలోచనలు పుట్టట్లేదు. ఎందుకూ మన చదువులన్నీ? చంకనాకినికా?

ఇవ్వాళ్ళ నిజంగానే బద్దలు గొట్టారు. పిరికి వెధవల్లారా, ఏం పీకుతార్రా?  “తెలుగుజాతి ఐక్యత కోసం ప్రాణాలిస్తామ”ని వెళ్ళి ఒంటిమీద పెట్రోలు పోసుకొని తగలేసుకోగల్రా? మీరు వెనుకంజ వేస్తోంది అందులోని ఉన్మాదాన్ని చూసి కాదు. మీ పిరికితనం వల్ల. మీకే గనక బుర్రలుంటే, వాటిని నేను సింబాలిక్‌గా పడగొడ్తున్న ప్రతి రోజూ, ఏం చెయ్యాలో ఆలోచించేవాళ్ళు.

సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే, పోయి ఆత్మహుతి చేసుకొని చూపించండి. ’తెలుగుజాతి’ ఐక్యత కోసం తెలంగాణ ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆత్మత్యాగం చేసి చూపించండి.
______________________

ఔను. ఇది రాజకీయ కుట్రే కావచ్చు. ఐతే, ఎగస్ పార్టీ  బుర్రేం దొబ్బింది?  సరే. ఏదైనాగానీ, ప్రస్తుత రాజకీయాలకి  యూనిఫికేషన్ రోజులు కాదు. నా దృష్టిలో ఇంకా డివిజివ్ పాలిటిక్స్ నడుస్తాయి. అందుకే చెప్తునే ఉన్నాను.

డైవర్సిటీని రాజకీయం నడిపిస్తే,  యూనిటీని మేధావులు నిలబెట్టాలి అని.
____________________

తెలంగాణావాదులొచ్చి దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం అంటూ చెప్పకండి ప్లీజ్. ఎలాగూ మన జాతి వేరు, మన తల్లి వేరు, మన భాష వేరు అంటూ, మన  విశష్టితని పెంచుకుంటున్నాం  అనుకుంటూ ద్వేషంతో, అతి తెలివితో జీవించే నిర్ణయం తీసేసుకున్నాం గనక, ఏమీ ఖండించక్కర్లేదు. ఈ దేశంలో రౌడీయిజమూ, వాండలిజమూ ఇవే రాజకీయ ఆధిపత్యానికి మార్గాలు. గాంధీ కూడా అదే నిజం అని రుజువౌతున్నట్టు గ్రహించిన రోజు, నలిగి నలిగి ఇక నా వల్లకాదు తీసుకుపొమ్మని దేవుణ్ణి వేడుకుంటే, నాధూ రాం God  सॆ వచ్చి, delivered him out of his pain.   మొన్న మస్జీదు పగలగొట్టిన రోజూ ఈ దేశ ప్రజ నిరూపించింది అదే. మనం ఓర్వలేని సింబల్స్‌ని మనం పగలగొడతాం. అలా, మన ఆధిపత్యాన్ని నిరూపిస్తాం.

సప్పోజు రేపు తెలంగాణ బొమ్మలే అక్కడ పెట్టాం. ఎళ్ళుండి ఆంధ్రా వాళ్ళు పడగొట్టారు. అప్పుడు ఎలా ఫీలవుతారు? లేదండీ – ఆంధ్రలో ఉన్న ఏ పోతన బొమ్మనో, తెలంగాణవాడని చెప్పి పగలగొడితే ఎలా ఉంటుంది? ఐనా, ఇవ్వన్నీ తెలీక చేశారన్నట్టు నేను మాట్లాడటం నా మూర్ఖత్వం.

కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ కోశానైనా మీరూ తెలుగు వారే నన్న గ్రహింపు మీకుంటే, మీరు తెలుగువారేనన్న భావన మీకుంటే,  ఇదంతా “తెలుగుజాతి ద్రోహ”మని మాత్రం మరువద్దు. మరో రకంగా ఇదంతా దేశద్రోహం. కానీ, అదంతా, మీకు ఓ దేశాభినం అంటే ఏంటో తెలిస్తే మాత్రమే అర్ధమౌతుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ జాతిగా విశిష్టులౌతున్నాం అనుకున్నాంగా, ముందు ముందు తెలుసుకుంటాం.

_______________________

అడుగుతున్నదేంటి? ప్రత్యేక రాష్ట్రం. అంటే, ఇది రాజకీయ విషయమే! అది నాకున్న క్లారిటీ. రాజకీయలు మాట్లాడ్డం నాకిష్టం లేదు. నేను రాజకీయం చెయ్యను. తెలంగాణా సమస్యలేవైనా కావచ్చు, మాట్లాడుతోంది, అర్ధిస్తున్నదీ, పోరాడుతున్నది ఓ రాజకీయ పరిష్కారాన్ని సాధించటానికే. అందుకని ఈ విషయాల్లో తలదూర్చను. కానీ, ఇది రాజకీయాలకతీతంగా ఏదో మారిపోయిందన్నారుగా! విద్యారుర్ధులేదో ముందుకొచ్చారు వీరతిలకాలు దిద్దుకొని అన్నారుగా! అందుకని నోరెత్తాను. అంతే కాదు, ఇప్పుడు బద్దలు కొట్టింది ’తెలంగాణ రాజకీయవాదులు’ కాదు ట – అల్లరిమూక ట. ఆందోళన కారులు ట. మీడియా ఇమ్మిడియేట్‌గా మార్చి చెప్పిన పదం అది. అందుకని నోరెత్తాను. ఇది జాతి ద్రోహమని.
_____________________________

 ఔను మరి! ఆశయం కోసం జీవించనదీ  ఓ జీవితమేనా? అందుకే పిలుపునిస్తున్నాను. తెలుగు జాతి ఐక్యతకోసం ఆత్మహుతిలివ్వండి అని.

ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ఫనెటిక్ భాష నేను వాడలేదు మరి!కానీ, తెలిసుకున్నాను నాయనా! “ఆశయాలకోసం పోరాడేటప్పుడు ఫలాల్ని ఆశించరు. ఫలితం సిద్ధిస్తుందనే నమ్మకంతో పోరాడతారు.” అని.

మన దగ్గర “థాట్ ప్రొవోకింగ్” ప్రశ్నలే కాదు బాబు. శ్రీకృష్టుడంతా ఫిలాసఫీయే ఉంది – philosophers of the ‘selfless action’. Even when the very question is about ‘regionalism’, we support all ‘selfless’ creatures to kill themselves irrespective of   ‘ప్రాంతీయత’. We beleive in active participation in socio-political action. Wow! చచ్చేదెవరూ? చంపేదెవరూ? కానీండి. జనాలు ఛస్తుంటే, వారి వీరత్వానికి, త్యాగనిరతికి, జోహార్లర్పిద్దాం. స్థూపాలు కట్టి, భవిష్యత్తులోనూ ఇలాగే ఇంకా చచ్చేవాళ్ళను తయారు చెయ్యడానికి సింబల్స్ సృష్టిద్దాం. కవిత్వం వచ్చుగాబట్టి, కవితలు కూడా రాద్దాం.

ఒకవేళ ఎవరైనా చరిత్రలో ’ఇది తప్పురా’ అని చెప్పుంటే, వాడిని మాత్రం సెక్సు స్కాండల్స్‌లో ఇరికిద్దాం. వాడి వ్యక్తిత్వానికి స్వార్ధాన్ని అంటగటదాం. చివరికి, ఇలాంటి ఉద్యమ ఉన్మాదంలోనే వాడిని ఎవరైనా హత్యజేసినా, ఆ ఉన్మాదాన్ని, ఉద్యమ స్ఫూర్తిగానే తీసుకుందాం. అంతేగానీ, ఇలాంటి ఆత్మార్పణ తప్పు అని మనం చెప్పం. ఏది తప్పు? ఏది ఒప్పు? ఎవడు నిర్ణయించగలడు? భావజాల యుద్ధాలు చేస్తూనే, రాజకీయంలో రక్తపాతం లేకుండా, just మనుషల ప్రాణాలు మాత్రం ధారపోద్దాం.  ప్రాణత్యాగం చేయలేని జీవితమూ ఓ జీవితమేనా? ప్రాణత్యాగం లేని ఓ ఉద్యమమూ ఉద్యమమేనా!?

ఫలితాలతో, ఉజ్వల భవిష్యత్‌తో సంబంధం లేకుండా, చావండి. ఫలితాల సంగతి మేం చూసుకుంటాం.
_______________________________

భావావేశంలో ప్రాణాలిచ్చేసిన ఎందరో దేశభక్తుల పేర్లు నిజానికి ఎవ్వరికీ గుర్తులెవ్వు. కాదు. అసలు మనకు తెలియదు. ఎందుకంటే, ఆ ’గుర్తింపు’ ఎందుకు కావాలోకూడా ఆలోచించుకోని అమాయక నిస్వార్ధ భావావేశం వాళ్ళది.

’ఆలోచించి’, నిస్వార్ధంగా ‘జీవించండి’. ఫలితం ’ఆశిం’చ కుండా చావద్దు. ’ఆశయ’సాధనకై జీవించండి. ఇందులో సందిగ్దతకి తావు లేదు.’చావు’యుద్దాలు ప్రోత్సహించకండి.
___________________________________
ఏది తప్పు? ఏది ఒప్పు? ఎవడు నిర్ణయించగలడు? అవి చాలా పెద్ద మాటలు కదండీ! కేవలం ఋషులు మాత్రమే దాన్ని చెప్పగలరు. నిజం!

అహంకారాన్ని, అనవసర అయోమయాన్ని తగ్గించుకుంటే ఇక్కడున్న వాళ్ళమే ఋషులైపొతాం.ఈ కాలనికి నిర్ణయించగలం. రాజకీయ వేర్పాటుకై , జాతిని విడగొట్టాల్సిన అవసరం లేదు.
_____________________________

తెలంగాణాలో ఆలోచించటం వాడుకలో లేదు అన్న మీ వాక్యమే చెబ్తుంది, మీ దురంహకారాన్ని. ఇక మీరేం ఆలోచించగలరు? మీకీ శాస్తి జరగాల్సిందే.

ఒకప్పుడు “అందరికీ ఉన్నత విద్య అవసరం లేదు. ఇస్త్రీ చేసుకొని బతకడానికి ఉన్నత విద్య ఎందుకు? పైగా దీని వల్ల ఉన్నత విద్య యొక్క విలువ దెబ్బ తింటుంది”, “అసలు ఉన్నత విద్యని తెలుగులో చెప్పుకోవాల్సిన అవసరం లేదు” అన్నంత దురంహంకార ఉపదేశాలుండేవి. ఆ అహంకారాన్నించి మీరింకా బయటికి రాలేదు. అందుకనే నే చెప్పేది మీకింకా అర్ధం కాలేదు.

ఎంత తిక్క శంకరయ్యలైనా, మీరు చెప్పేదాంట్లో కొంత నిజం ఉంది. దేశభక్తి, భాషాభిమానం అంటూ మనం ఎంత గుంజుకున్నా,  సగటు మనుష్యులందరికీ తినటం, దెం***౦, పడుకోటం ఇవే కావాలి. వేరేవేమైపోయినా ఏమీ పట్టదు.ఓహో తమరికి గ్రాంధీకంలో చెప్పాలి గావాల్ను. అదే, మీరన్న –  నిద్రాహార మైధునాలు.

కానీ, ప్రతి మనిషీ ఆలోచించగలడు. ఆలోచించగలగటం వల్లే మనం ఇలా  మనుష్యులం అయ్యాం. అది గుర్తించగలిగిననాడు, ప్రతి మనిషి సర్వయుగాల్లోనూ ఆలోచనపరుడే నని తెలుసుకుంటే, ’ఒకప్పుడు’ కాదు. ఇప్పటికి కూడా! అని తెలుసుకుంటారు. [Man is rational emotional spiritual animal]. ఆల్మోస్ట్ ఈ దగ్గరి కొచ్చి, ఎందుకోగానీ మళ్ళీ ఎటో జారిపోతుంటారు కొందరు.

అంతరాంతరాళాల్లో వెదకండి. It is just that our over reliance  and “రాగం” on ‘thought’ that makes us the thought-oriented-guys that we are, and also that which makes us hate (“ద్వేషం”) this ‘action’ of vandalism. 

All said and done, ఇప్పుడు బద్దలైంది మీ అభిమాన నటుడి రూపురేఖల్లోని బొమ్మలు మాత్రమే. ఏమీ మించిపోయింది లేదు.
___________________________________

’తెలుగు జాతి’ అనే Setలో,  తెలంగాణావాళ్ళూ ఉన్నారు. ’తెలుగు’ చరిత్రలో( ఆర్ధిక రాజకీయ సాంఘిక సాహిత్య సాంస్కృతిక చరిత్రలో)  ఆంధ్రుల ఆధిపత్యకాలం నచ్చినా  నచ్చకున్నా, దాన్ని తగలేసుకొనే ఆలోచనలు గానీ , పనులుగానీ చెయ్యటం మూర్ఖత్వం. ఈ మాటని ఇంతే నిర్దిష్టంగా, ఏ ఇతర (ఆధిపత్య)పోరాటాల గురించైనా  చెప్పగలను.

మరొక్క మాట: ప్రభుత్వం అమలు చేద్దాం అనుకున్న ఏ పరిపాలన ప్రణాలికనైనా వ్యతిరేకించి ఉద్యమించినప్పుడు, ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణిచివేయటానికే చూస్తుంది. అది ప్రభుత్వ కర్తవ్యం. ఎప్పుటి వరకూ ఈ అణిచివేత అమలులో ఉంటుంది? ఎప్పటివరకైతే తన పరిపాలనా ప్రణాలికని మార్చుకోదో / లేక తన ప్రణాలికని ఇక అమలు చెయ్యలేనని తేల్చుకుంటుందో అప్పటి వరకు. ఒక్క అణిచివేతే కాదు – తనకెదురయ్యే వ్యతిరిక్తతని ఎన్ని రకాలుగా రూపుమాపగలదో అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తుంది. పరిపాలన / అమలు కార్యంలో అది అనివార్యం. ఇది తెలియడానికి గొప్ప తెలివి తేటలక్కర్లేదు. మన నిత్య జీవితంలో, “అమలు” చెయ్యాల్సిన మన బాధ్యతలొచ్చినప్పుడు, మన ప్రవర్తననీ, ఆలోచనలనీ గమనించుకుంటే చాలు. అలాంటప్పుడు, ప్రభుత్వ అణిచివేతకి వ్యతిరేకంగా, ఇలా విశృంఖల స్వైరవిహారం జరిగింది అనటం అసమంజసం. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయిందంతే అని దాన్ని జస్టిఫై చెయ్యాలని చూడటం, మరింత దిగుజారుడుతనం. 

బహుశా ప్రభుత్వాన్ని పలుమార్లు వైఫల్యం చెందనిస్తే, ఉద్యమం విజయం సాధిస్తుంది. నిజమే. కానీ, ఆ ప్రక్రియలో తెలుగుజాతి భావనకే విఘాతం కల్గించే ఆలోచనలు, ప్రవర్తన ఉద్భవించటం చాలా దురదృష్టకరం.

జస్టు ఓ రెండుమూడొందల మంది కలిసి మన దేశాన్ని పాలిస్తున్నారు. వీళ్ళందరూ ఓ 600 మంది చచ్చారుకదా అని నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళుకుంటాయి. ఆ సమీకరణాల వల్లే, కొత్త రాష్ట్రం ఏర్పడట్లేదు. ఇది ప్యూరుగా రాజకీయ సమస్య. ప్రజా సమస్య కాదు. ఐతే, భారతదేశ స్వాతంత్ర పోరాటం మాటో అంటారు కొందరు. ఔను. అది కూడా ప్యూరుగా రాజకీయ సమస్యే. కానీ, ఆనాటి రాజకీయం, వలసవాద దోపిడీ నుంచి బయట పడాలని చూసింది.ఆ వలసవాదం వల్లే, మన దేశ ఆర్ధిక పరిస్థితి (మరెన్నో దేశాల్లాగానే) కుంటు పడుతోందన్న సంపూర్ణ …What shall i say..comprehensive understanding కలిగి ఉంది. అప్పుడు కూడా, స్వంతంత్ర్యాన్ని వెంటనే రాజకీయ పరిష్కారంగా మేధావులందరూ అంగీకరించలేదు. సరే అదంతా ఒక ఎత్తు. ఏదేమైనా, ఆనాటి గాంధీయ వాద పోరాటంగానీ / ఇతర పోరాటాలు గానీ విజయం సాధించాయని మనం అనుకోవడం కూడా పూర్తిగా నిజం కాదు. కాస్త కాలం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడైనా అంతే.

ఇప్పుడు ఆంధ్ర వలసవాద దోపిడీ అంటూ, ఆంధ్రుల ఆధిపత్యాన్ని అభివర్ణించటం, అతి తెలివి. ఆధిపత్యం కోసం పోరాటం చెయ్యడం వేరు.దోపిడీ వేరు. తెలంగాణా సమస్యలకి కారణం – ఆంధ్రుల ఆధిపత్యమే అన్నది చాలా తప్పుడు వాదన; ఐనా ఓ పూర్తి  రాజకీయ వాదనగా, అంతవరకూ కూడా పోనీ ఒప్పుకోవచ్చు. కానీ, వాళ్ళు దోచుకెళ్ళారు అనే ఆర్దిక వాదన, అర్ధ రహితం. ఆంగ్లేయులు నిజంగానే దోచుకెళ్ళారు. వీటి మద్య భూమ్యాకాశలంత అంతరం ఉంది.

ఐతే, తెలంగాణా అభివృద్దికై, అవకాశాల పెరుగుగుదలకై, ఆంధ్ర ఆధిపత్యం నుంచి తప్పించుకొని ఓ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడదలుచుకున్నాం, అందుకని మా రాష్ట్రం మా కివ్వండి అన్న నిర్దిష్ట ప్రణాలికతో  ఉద్యమిస్తే, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం సులభ సాధ్యం ఔతుంది.

కావాలంటే ఒక్క విషయం గమనించండి. మన దేశభావజాలంలో,  రాజకీయంగా బ్రిటన్‌తో వేరుపడ్డా, వారి మీద అంత ద్వేషం లేదు.వాళ్ళ పెట్టుబడిదారీ దోపిడీ మీదకూడా ద్వేషం లేదు!!! కానీ, అనవసరంగా భరతజాతి భావనలో ఉన్న బీటలని ఆధారం చేసుకొని, విడగొట్టుకున్న పొరుగుదేశాలతోనే మనకి ద్వేషం. ఎందుకు? ’దేశం’ అనే రాజకీయభావనలో ’ద్వేషం’ నింపిన రాజకీయం జరిగింది కాబట్టి.

ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. గుర్తెరిగి – తెలుగుజాతి ఐక్యత చెక్కుచెదరని, రాజకీయ పోరాటాన్ని చేసుకోవడం, మనుష్యులుగా మనకు మంచిది. ఆలోచించండి.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

9 వ్యాఖ్యలు పై “తింగరి వెధవల్లారా.. ఈ జాతిద్రోహులే మీకు కరెక్టు.”

 1. sbmurali2007 Says:

  ==> డైవర్సిటీని రాజకీయం నడిపిస్తే, యూనిటీని మేధావులు నిలబెట్టాలి అని.
  Well said and I totally support that sentiment! Just check out my take on this
  http://sbmurali2007.wordpress.com/2011/03/14/%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%82/#more-279

  regards
  Sharada

 2. krishna Says:

  ” ’దేశం’ అనే రాజకీయభావనలో ’ద్వేషం’ నింపిన రాజకీయం జరిగింది కాబట్టి.
  ఇప్పుడు జరుగుతోంది కూడా అదే.”

  Well Said.

 3. యాద్‌గిరి Says:

  ఏందిరా భయ్ నీ లొల్లి? ఏం సమజ్ అవుతలేదు. దేని మింద మాట్లాడుతున్నవ్?

 4. శ్రేయోభిలాషి Says:

  మీరు ఏం చెప్పదల్చుకున్నారో క్లారిటీ లేదు. ఎన్నిసార్లు చదివినా ఏం అర్థం కాలే. అది నా లోపమేనని మీరంటే “సరే, అలాగే అనుకోండి” అంటాను.

  అయితే మీరిక్కడ కొన్ని వాక్యాలలో సుప్రసిద్ధ సీనియర్ బ్లాగరు తాడేపల్లిగారిని ఇన్‌డైరెక్టుగా పర్సనల్ గా దూషిస్తున్నట్లు అనిపించింది ఆయన్ని లోతుగా చదివేవాళ్ళకు ! మీరు ఏ తాడేపల్లి టపాల నుంచి quote చేశారో ఆ టపాలకూ, ఇక్కడ మీరు రాసిన టాపిక్కుకూ సంబంధమే లేదు. ఒక మేధావిని ఖండించడానికి ఇంకో మేధావి కావాలి. వాదాన్ని వాదంతో ఎదుర్కోకుండా “తిక్క, పిచ్చి, గ్రాంథికం” అని దూషిస్తే అది మిమ్మల్ని ఏ లెవెల్ లో నిలబెడుతుందో, నే చెప్పడమెందుకు ? మీరే ఆలోచించుకోండి.


 5. ఏ కొందరి స్వార్థరాజకీయనాయకులకో అమ్ముడుపోయిన
  ఈ వెన్నుమఖలేని వెర్రి వెధవలకు ఏమి చెప్పగలం
  ఎలా చెప్పగలం


 6. 🙂 🙂 🙂

  నువ్వు చెపింది ప్రజలకు అంత సులువుగా అర్థం కాదు బ్రదర్…

 7. తెలంగాణ బిడ్డ Says:

  విగ్రహాలు ద్వంసం చేయడం, అరాచక పనులకి పాల్పడటం తెలంగాణా సంస్కౄతి కాదు. ప్రాణాలు త్యాగం చేసుకుంటాము కానీ ప్రాణాలు తీయం.
  కానీ ఈ కుటిల రాజకీయ నాయకులు దుర్మార్గపు ఆలొచనలతో తెలంగాణా రాకుండా అడ్డుకుంటుంటే చూసి తట్టుకోలేక మా నిరసనని అలా బహిర్గతం చేశాం.
  “మామూలుగా ఒక పిల్లిని ఒక గదిలో బందించి హింసిస్తే అది ఏం చేస్తుంది…. కచ్చితంగా కొట్టేవాడి పీక కొరుకుతుంది”.
  ఇంకా ఆలస్యం చేస్తే విగ్రహాల విద్వంసం చా…..లా చిన్న విశయం అవుతుంది, మున్ముందు జరగబోయే పరిణామాల ముందు…

  జై తెలంగాణ. జై జై తెలంగాణ.

 8. Jai Says:

  These statues represent hegemony & linguistic chauvinism. My only regret is that the tegulu nalli statue was spared.

 9. rayraj Says:

  @Jai:
  :)) Do you know what is hegemony?Why it comes into being? What are its advantages and disadvantages?

  [Mahesh had once explained and we discussed about it. Click here.:

  Also, see this, especially my answer to Abishek.

  Linguistic chauvinisim? That too in AP? My dear friend, you just don’t know what you are talking.

  See, its like this: Whether i subscribe to Lenin’s views or not, I just can not accept demolition of his statues even in Russia. The point is that there are people like me all over the world and they will be there. Please understand you can’t kill all of us.

  For eg., I propose that we are actually under the hegemony of the West. Then what do we do about it? I have been writing on this in the last two years in so many words and in so many posts. Please read and enjoy.

  Or…oh..ok. It was a satire. isn’t it :))…ok ok.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: