“యస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆ ఋషులకంటే గొప్పవాడా?”

జార్జ్ బుష్ వల్లే అరబ్ విప్లవం వచ్చింది ట.

పోయిన డిసెంబరులో, ట్యునీషియాలో, ఓ పళ్ళమ్ముకునేవాడు ఆత్మాహుతి చేసుకున్నాడు. ఎందుకు? పని లేక. ఔను. నిజంగానే పని దొరక్క. మరో పక్క స్ధానిక అధికారులు వేధింపులు కూడా తోడయ్యాయి. అలా వాడు ఒంటికి పెట్టుకున్న నిప్పు, ఆ దేశంలో ఓ విప్లవాన్ని వెలిగించింది. అక్కడి ప్రెసిడెంటును పడగొట్టింది. అంతే, విప్లవజ్వాలలు దావాలనంలా పాకి, అరబ్బు దేశాల్లోని నియంతృత్వలైతేనేమీ, మోనార్కీలైతేనేమీ , అన్నింటికీ నిప్పెట్టింది

ఈ పరిణామం చైనీసు ప్రభుత్వాన్ని కూడా భయపెట్టింది ట. ఈ అరబ్ విప్లవం, సడన్‌గా వచ్చిన ఓ అనూహ్య పరిణామం – సోవియట్ యూనియన్ పతనంలా , తూర్పు ఐరోపాలోని కమ్మ్యునిస్టు పతనంలా, బెర్లిన్ గోడ పతనంలా.

మనం చూస్తున్న ఈ పరిణామాలకి కర్తగా, ఒక వ్యక్తి మాత్రం గర్వించవచ్చున ట – అమెరికా భూత్‌పూర్వ్ రాష్ట్రపతి – జార్చ్ బుష్ (jr) . కనీసం బుష్ బుద్దిపూర్వకంగా  వేలెట్టకపోయినా, మొత్తానికి వారి కెలుకుడి వల్లే , అరబ్బు లోకం అంతా ప్రజాస్వామ్య  పంథావైపు పయనించేస్తోందని,  వారికి రెండు వీరతాళ్ళెయ్యమంటున్నారు. ఎవరు?

మెట్టమొదట ఈ మాట అన్నవాళ్ళల్లో The Economist (February 5) ఉంది ట. The Economist wrote: “The Americans leant on Egypt to hold more open elections in 2005, and in 2006 they talked an astonished Israel into letting Hamas contest Palestinian elections in the occupied territories. Even the Saudis were prevailed on to hold some (men only) local elections. All this was based on a particular theory, the post 9/11 neoconservative conclusion that the root cause of terrorism was the absence of Arab democracy.”

పై వ్యాఖ్య కరెక్టేఐనా, ఆఫ్గనిస్థాన్లోనూ, ఇరాఖ్‌లోనూ బుష్‌గారి కెలుకుడి కార్యక్రమాలు అందులో కనపడట్లేదు. ముందు వీటిని తీవ్రవాదానికి ఆశ్రయమిచ్చిన దేశాలుగానే భావించిన బుష్‌గారు, క్రమంగా అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, ప్రజాస్వామిక ప్రభుత్వాలను నెలకొల్పాల్సిన అవసరాన్ని గ్రహించాడు.  ఇక అక్కడ్నించి, ఆ దేశ ప్రజల్లో  ప్రజాస్వామ్య ఆకాంక్షని పెంపొందించే ప్రయత్నాలు మొదలెట్టాడుట. ఈ విషయం పై, బుష్ ఆలోచనలోని క్లారిటీని, నిబద్ధతని  ఎరుగనేని, వారి  “డెసిషన్ పాయింట్స్(Decision Points)” అనే  మెమోయిర్స్ (స్మృతులు) చదువవలసిందిగా చెబ్తున్నారు. ‘Freedom Agenda’ అనే పేరుతో, ఈ విషయంపై ఓ చాప్టరే కేటాయించాడట.

బుష్ ప్రభుత్వహయాంలో జరిగిన 9/11 ఘటన,  ఆయన మొదటి టర్ములో ఓ నిర్ణయాత్మక క్షణం. అది అతన్ని చాలా బాధపెట్టి ఆలోచనకు పురిగొల్పింది. అమెరికాకు పొంచివున్న తీవ్రవాద భయాన్ని ఎలా తుదముట్టించాలని తీవ్రంగా ఆలోచించి , తన బుష్ డాక్ట్రిన్‌తో బయటొకొచ్చాడు. అందులో నాలుగు భాగాలున్నాయి.  మొదటిది – తీవ్రవాదులనీ , తీవ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశాలనీ విడివిడిగా చూడకుండా, ఒకటిగానే పరిగణించటం. రెండోది – యుద్దాన్ని శత్రువు గడపదగ్గరకి  తీసుకెళ్ళటం. మూడోది – తీవ్రవాదచర్యలు రూపొందక ముందే, మొగ్గలోనే తుంచేయటం. నాలుగవది –  advance liberty . ఇది ‘freedom agenda’.

ఇదేదో రాత్రికి రాత్రి బుష్ రాసుకున్న ఆలోచన కాదు. ఆఫ్‌ఘనిస్థాన్‌లోనూ , ఇరాక్ లోనూ తను మొదలెట్టిన కెలుకుడు కార్యక్రమాల వల్ల, తనలో మెల్లిగా తలయెత్తిన ఆలోచనలు, రెండో విడత ప్రమాణస్వీకర సమయానికి, ధృడనిశ్చయంగా పరిణమించాయి.

2001 చరమాంకంలో, ఆఫ్‌ఘనిస్ధాన్‌ని ముట్టడించిన రోజు, అల్ ఖైదా తీవ్రవాదానికి స్వర్గధామంగా నిలుస్తున్న ఓ ప్రభుత్వ హయాంను కూలదోస్తున్నట్టు మాత్రమే బుష్ భావించాడు. కానీ, ఎప్పుడైతే, 2004లో ఆఫ్‌ఘనిస్ధాన్ తన మొదటి  ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌ని నిర్వహించిందో, అప్పుడు బుష్‌లో ఆశ చిగురించింది. ఇరాక్ విషయంలో, నియంతృత్వ స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పే ప్రణాలిక, అంతకు ముందు నుంచే ఉన్నది.

రెండో విడత ప్రారంభోపన్యాసంలో, తను ఈ ఎజండాతో ముందుకెళుతున్నట్టు స్పష్టం చేశాడు:  “The survival of liberty in our land increasingly depends on the success of liberty in other lands.So it is the policy of the United States to seek and support the growth of democratic movements and institutions in every nation and culture, with the ultimate goal of ending tyranny in our world.”

మొత్తంగా తెలుగులోకి అనువదించలేకపోతున్నాగానీ, “మనదేశంలో స్వేచ్చాయుత జీవనం ఉండాలంటే, సుఖశాంతులు వర్దిల్లాలంటే, ఇతర దేశాల్లోనూ అవి ఉండాలి. అందుచేత, ప్రతి దేశంలో, ప్రజాస్వామ్య ఉద్యమాలని పెంపొందించి, ప్రపంచంలో టిరన్నీని అంతం చేద్దాం”. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం: తనదేశంలో స్వేచ్చాయుత జీవనం ఉండాలంటే, సుఖశాంతులు వర్దిల్లాలంటే, ఇతర దేశాల్లోనూ అవి ఉండాలి.

ప్రతిదేశంలోని అటోక్రటిక్ ప్రభుత్వాలని, బలంతో కూలదోయటం సాధ్యం కాదు. అందుకొని ఒక బహుముఖ ప్రణాలికతో ముందుకెళ్ళారు. పాలెస్టీన్ ప్రాంతాలలో, లెబనాన్, జార్జియా, ఉక్రైన్‌లలో మొగ్గతొడుగుతున్న ప్రజాస్వామ్యాలకీ మద్దతిచ్చారు. ఇరాన్, సిరియా, నార్త్ కొరియా, వెనిజుయెలా లాంటి చోట్ల అసమ్మతి వాదులనూ, ప్రజాస్వామ్యమార్గంలోని సంస్కర్తలను ప్రోత్సహించారు. సౌదీ అరేబియా, ఈజిప్ట్, రష్యా, చైనాలాంటి చోట్ల, మరింత మర్యాదగా స్వేచ్చని ప్రోత్సహించారు.

చాలా మంది ఈ అప్రోచ్‌ని, స్వలాభాపేక్షగా, అవకాశవాదంగానే భావించారు. అభివర్ణించారు. ఆ ముసుగులో అమెరికా తన ప్రపంచాధిపత్యానికై ప్రయత్నిస్తోందని కూడా అనుకున్నారు. దానికి ఉదాహరణగా  ఆఫ్‌ఘనిస్థాన్‌లోనూ, ఇరాక్‌లోనూ జరిగిన మారణహోమాన్ని చూపిస్తారు. సౌదీ అరేబియా లాంటి దేశాలలోగాక, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రథమ అభ్యర్ధిత్వం ఇరాక్‌కే ఎందుకు యిచ్చారో తేల్చమన్నారు. ఇరాక్ యుద్ధం, అమెరికాకు అరబ్ దేశాలతో ఉన్న సంబంధాలని విషపూరితం చేశాయి. ఒకవేళ, ప్రజాస్వామ్య బద్ధంగానే, అమెరికాని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా ఉంటే, అమెరికా ఇంత లావున ఈ ప్రజాస్వామ్య ప్రోత్సాహాలనిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.

అవన్నీ నిజమే కావచ్చు ; కానీ, అఫ్‌ఘనిస్థాన్‌లోనూ , ఇరాక్‌లోనూ ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఎన్నిక, అరబ్ ప్రపంచంలో ఒక బలవంతమైన ప్రభావాన్ని చూపగలిగాయన్న విషయాన్ని మరవకూడదు. దీనివల్ల, ఎంతో కొంత సామరస్య ప్రభుత్వాలు, కొంత అభివృద్ది కలిగిన దేశాల్లో సైతం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకై కాంక్షని పురిగొల్పింది. ప్రజాస్వామ్య పంధావైపు మొదలైన ఈ పయనాన్ని, ఇక ఆపతరం ఎవ్వరివల్లా కాదు.  

బుష్ విధానం కూడా, రోనాళ్డ్ రీగన్‌లా,  చాలా సింప్లిస్టిక్‌గా కనపడి ఉండొచ్చు. లిబరల్ మీడియా, బుష్‌ని ఓ మూర్ఖుడిగా చిత్రించి ఉండొచ్చు. కానీ, రీగన్‌ విషయంలో మల్లేనే, బుష్‌ని కూడా  తక్కువ అంచనా వేశారు. ఓ సమర్ధ నాయకుడి ఇన్స్టింక్ట్స్, మేధావులందరినీ తప్పుగా నిరూపించడం ఇదేమీ మొదటిసారిగాదు. బుష్ ప్రెసెడెన్సీకి, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడమనే అంశం ఎలా ఓ కీలకమైన కేంద్రకమో ఒక్కసారి అర్ధంచేసుకోగలిగితే, ఆయన దృష్టిలో అమెరికాకి భారతదేశం ఎలా ఒక సహజ మిత్రదేశమయ్యిందో కూడా అర్ధంచేసుకోగలం. అణుఒప్పందం కోసం, అమెరికా ఎందుకంత వ్య యప్రయాసలకోర్చిందో కూడా వివరించగలుగుతాం.

దీని నుంచి వచ్చే మరో పర్యవసానం ఏంటంటే, ఇండో-చైనా లని పోల్చి చూసుకుంటున్నప్పుడు, ఇండియా కాస్త మెరుగ్గా కనపడతుంది. అంటే, అభివృద్దిలో చైనాని దాటివెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వృద్దిరేటుకాదుగానీ,  ఏ ఏకపార్టీ ప్రభుత్వమైతే చైనా ఎదుగుదలకి కారణంగా భావిస్తున్నామో, సరిగ్గా అదే ఇప్పుడు ఈ అరబ్ ప్రపంచంలోని ఉద్యమాలవల్ల చాలా వల్నరబుల్‌గా కనపడుతోంది. India’s bumbling democracy looks better in comparison. The old arguments lose their shine once democracy is seen as a non-negotiable good.

హమ్మయ్య : ఇక్కడికి  ETలోని  ఈ వ్యాసాన్ని  ఎలాగోలా చెప్పగలిగాను అనుకుంటున్నా.

ఉఫ్. సరే, ఇక నా విషయానికొద్దాం. ఈ ప్రయత్నమంతా, నాకేదో ప్రపంచం రాజకీయల మీద సూపర్ అవగాహన ఉందని కాదు. ఆ మాటకొస్తే, అంత ఆసక్తి ఉందనీ గాదు. ఎటొచ్చీ, ఎవడో ఒళ్ళు తగలేసుకున్నాడనగానే, దాంతోనే విప్లవం వచ్చేసిందనుకునే అమాయక జనం కోసం; వాళ్ళాకీ మరో కోణం ఇవ్వటం ఓ చిన్నపాటి లక్ష్యం.

సరే, ఆ విషయాలన్నీ తెలిసినా, తెలీకపోయినా,  ఇన్నాక మనం చెప్పుకున్న ముఖ్య విషయం : తనదేశంలో  స్వేచ్చాయుత జీవనం ఉండాలంటే, సుఖశాంతులు వర్దిల్లాలంటే, ఇతర దేశాల్లోనూ అవి ఉండాలి అన్న ఆలోచన.

అయ్యా  “సర్వేజనా సుఖినో భవంతు” అని ఎందుకంటామో తెలుసా? సరిగ్గా ఇందుకే. ఎవ్వడు సుఖంగా లేకపోయినా, మన సుఖం కూడా దొబ్బిపోద్ది. అందుచేత, అందరూ సుఖంగా ఉండేలా చూడటం ప్రతివాడి కర్తవ్యం.

మన బాలూకీ, కాస్త అతి తెలివెక్కువ. లోకంలో చెడ్డాళ్ళు కూడా సుఖపడితే ఎట్టా? అనుకొని, ఆ ఋషి వాక్యాన్ని రెండుగా విడగొట్టాడు. సర్వే జనా సుజనో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు అని. కానీ, ఏది సు? ఏదు దు? I mean,  ఏది మంచి? ఏది చెడు? ఎవరు సుజనులు? ఎవరు దుర్జనులు? ఎవరు నిర్ణయించగలరు?అది చాలా పెద్ద విషయం కదా! కేవలం ఋషులు మాత్రమే నిర్ణయించగలరు కదా! వాళ్ళకింకా ఎక్కువ విషయం తెలుసుగాబట్టే, అందరూ సుఖంగానే ఉండాలని కోరుకున్నారు. ఎవ్వడు సుఖంగా లేకపోయినా,పక్కనోడి సుఖానికి వాడు చేటు అన్న విషయం సంపూర్తిగా ఎరిగినవారు కాబట్టి.

To put it in the orthodox fashion,  “వాళ్ళని ఖండిచటానికి, బాలూ ఆ ఋషులకంటే గొప్పవాడా!? ”         :))

————————————————-

Offtrack: అసలు విషయం ఇంకోటి చెబితే, అందరూ గుంజుకోలేక ఇరుక్కుపోతారు. సదరు పళ్ళవ్యాపారి నిజానికి  ఆత్మహుతి చేసుకున్నది, అవమానం తట్టుకోలేక. రోజూ ఏదో ఓ పోలీసుతో గొడవపడటం తప్పని అక్కడి పరిస్థితుల్లో ఉన్న ఈ కుర్రవాడిని, ఆ రోజు ఓ లేడి పోలీసు చాచి లెంపకాయ కొట్టింది.  దాంతో ఏం చెయ్యాలో తెలీక, పై ఆఫీసరు దగ్గరికి వెళితే, వాడు వినలేదు. అప్పుడు ఒంటికి నిప్పంటించుకున్నాడు.

http://english.aljazeera.net/indepth/features/2011/01/201111684242518839.html

మిగితాది నే కెలకలేను. ఎందుకంటే, ఆడది కొట్టిందని ఆత్మాహుతి చేసుకున్నా, నేను తేలిగ్గా తీసిపడెయ్యలేను.

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

10 వ్యాఖ్యలు పై ““యస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆ ఋషులకంటే గొప్పవాడా?””

 1. nagamurali Says:

  సర్వే జనాస్సుఖినో భవన్తు అన్న ప్రార్థనకీ, జార్జ్ బుష్ ఫ్రీడం ఎజండా కీ పోలిక తేవడం కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయినా మీ పాయింటు నాకర్థమయింది.

  కెలకడానికో ప్రశ్న – సర్వే జనాస్సుఖినో భవన్తు తో పాటూ మనవాళ్ళు ‘గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం’ అని, ‘వినాశాయ చ దుష్కృతాం’ అని కూడా అంటారు. మరి వాటి గురించేమంటారు? 🙂

 2. Shiva Bandaru Says:

  chala visayalu cepparu. manchi vishleshana.

 3. CHANDU Says:

  Something wrong analogy you have taken out! 🙂
  But readable. 🙂

 4. versa kay Says:

  It is not the sages that determine who is good and who is bad nowadays. it is the society in general that decides this ultimately. As we say in Telugu, ” Balamunnavade Raju.”, so who ever is strong controls the society and decides who is sujana and who is durjana. And when he is a Durjana himself, he is overthrown. In an election in a democratic society and if people can not wait that long through an uprising. In atyrannical society it may need a violent uprising to ovrthrow the Durjana and install a Sujana in his place.
  There is nothing wrong in hoping that all people should turn Sujanas conforming to your conception of the term and that all such Sujanas be blessed with happiness. This is what you and I also do. And if Balu wants to be one up on the rishis, i dont have any grouse. But if he sits in judgement whether I am a Sujana or not then I have an issue and I will sit injudgement on his saujanyata or otherwise.

 5. rayraj Says:

  @నాగమురళి: పాయింట్ పట్టేసానంటున్నారు గాబట్టి, థాంక్యూ.

  నా బ్లాగు చదువుతూనే ఉండమని మనవి. వాటిని నేను టచ్ చేసిన రోజు, మీరూ అర్ధం చేసుకోగలరు. కావాలంటే, అప్పుడు చర్చ మొదలెట్టవచ్చు 🙂
  ——–

  ఈ పాయింట్ మీద ఇంకా నా నుంచి పోస్టులు అడపా దడపా వస్తూనే ఉంటాయనుకోండి.ఐనా, ఒక్క రెండు లైన్లు – for whatever benefit it may bring in general….

  1.ఇక్కడ ఎనాలజీ బుష్ డాక్ట్రిన్‌తోనో, ఆయన ఫ్రీడం ఎజండాతోనో ఐతే , అది ఎబ్బట్టుగానే ఉండొచ్చు. కానీ, ఇక్కడ ఎనాలజీ ఉన్నది “one’s success is increasingly depending on the other’s” అన్న పాయింటుతో/ఆలోచనతో.

  2.ప్రపంచంలో దేన్నైనా మనం “అంతం” చేద్దాం అని బయలుదేరితే, దాని అర్ధం మనం చాలా ’టిరన్నికల్’గా ప్రవర్తించబోతున్నాం అని. అలాంటి టిరన్నీని ’అంతం’ చేద్దాం అని బయలుదేరటంలోని ఐరనీ ఉంది చూశారు…అదిగో అది ఇక్కడ చాలా ఎబ్బట్టుగా ఉంది.

  అంతేగానీ, ’మన సుఖం కూడా పరుల సుఖం మీద ఆధారపడి ఉంది’ అన్న ఆలోచనలో ఏమీ ఎబ్బెట్టుగా లేదనే అనుకుంటున్నాను. అందుకనే, ఇది రీడబుల్‌గా ఉందేమో.

  P.S. బాలూ ఫ్యాన్సు చాలా మంది వచ్చినట్టున్నారు! 🙂

 6. కామేశ్వర రావు Says:

  ఇందులో మరో మెలిక ఉంది. “సుఖినోభవంతు” అన్నదాన్లో మాత్రం “సు” ఏవిటి? ఏది “సు”(సుఖం)? ఏది “దు”(దుఃఖం)? ఎవరు నిర్ణయించ గలరు? ఇది కూడా చాలా పెద్ద విషయమే!
  అమెరికా తను నిర్ణయించిన, తనకు వర్తించే “సు”నే అందరికీ వర్తిస్తుందని బలంగా నమ్ముతుంది. అందుకే అందరికీ అదే “సు”ని అంటగట్టాలని చూస్తుంది. అలా తన “సు” వాళ్ళమీద రుద్దినప్పుడే తనకి తన “సు” ఉంటుంది.

  అటు అమెరికాకి ఇటు చైనాకీ కూడా తమ తమ “సు” అంటే ఏమిటో ఇదమిద్ధంగా తెలుసు. అవసరమైతే దాన్ని మార్చుకోడం తెలుసు. తన “సు”ని ఇవతలవాళ్ళ మీద నయానో భయానో రుద్దడమూ తెలుసు. ఇది మనకి తెలీదు.
  కానీ మనకీ కొన్ని తెలుసు. “సు” అంటే ఏమిటన్న విషయంపై వాదులాడుకోడం తెలుసు. ఇది కేవలం రెలెటివ్ అని మొత్తం గాలికొదిలెయ్యడం తెలుసు. నయానో భయానో ఇవతలవాళ్ళు చెప్పే “సు”ని మన తలకెక్కించుకొని, అది మా పెర్సనల్ చాయిస్ అని మీసం మెలెయ్యడం తెలుసు.
  కోడిగుడ్డుకి ఈకలు పీకడం అన్నిటికన్నా బాగా తెలుసు! 🙂

 7. rayraj Says:

  🙂 🙂 సరిగ్గానే చెప్పారు . In fact, ఏది సు? ఏది దు? అన్న పదాలు ఈ మెలికని స్పష్టంగా బయటికి తెస్తున్నాయి, పోనీ అవి ఎడిట్ చేసేయనా అనుకొని కూడా, చూద్దాం ఎవరు పట్టుకుంటారో అనుకున్నాను.

  చివరికి, రెలటివ్ అని తెలిసిన సుఖదు:ఖాలు రెండిటినీ సమదృష్టితో చూసే ఆవశ్యకతని గుర్తించినా, ’అందరూ సుఖంగా ఉండాల’నే కోరుకుంటాం! బహుశా, దీనికి కారణం చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. మనకి దు:ఖం అనిపించిన విషయం కూడా, ఇతరులు ’సుఖం’గా భావించారు కాబట్టే కోరుకుంటున్నారు.మనకి ’సుఖ’మనిపించినవే మనమూ కోరుకుంటున్నాము.ఓ ఎక్స్‌ట్రీంలో – BDSMలో, ఛళ్ళున నొప్పిపుట్టిస్తేనే, ’సుఖం’గా ఉంటుంది మరి! అంచేత, చివరికి అందరూ కోరేది సుఖమే! అందుకనే, ఎవరూ కూడా ఆ వాక్యంలోని ’సుఖాన్ని’ మాత్రం వదలట్లేదన్నమాట.

  🙂 సరిగ్గానే చెప్పారు.కోడిగుడ్డుకి ఈకలు పీకడం అన్నిటికన్నా బాగా తెలుసు! 🙂

  అందుకే కదా, ఈ గాలికొదిలేసి లక్షణాన్ని వదలగొట్టాలో వద్దో కూడా తేల్చుకోలేకపోతున్నాం!

 8. Latha Says:

  Bala subramanyam “sarve sujana sukhinobhavantu ” ani oka TV show lo cheppadam nenu kuda vinnanu.

  But it doesn’t mean that he decides “sujan” and “dur…”.
  But irrelevent point lo atani peru ni title ga petti chalaa information ichaanu ani meeranukovadam chuste jaalestondi.

  Chala healthy atmosphere lo jarugutunna telugu blogging lo ea controvorsy leni oka vyakti peru use cheskuni, ila ratalu rayadam, nijam ga unfortunate.
  -Latha ( F.Y.I im Not Balu fan)

 9. SAI GANESH Says:

  “సర్వేజనా సుఖినొభవంతు సమస్తసన్మంగళానిభవంతు” (ప్రజలు అందరు సుఖంగా ఉండాలి అందరికి సర్వశుభాలు కలగాలి అని దీని అర్దం). అందరూ బాగుండి అన్ని సుఖాలు కలిగిఉంటే ఒకరిని ఒకరు దొచుకొవలసిన పని లేదుకదా? స్వర్గీయ ఉషశ్రీ గారు పైన చెప్పిన దాన్ని తన రేడియొ కార్యక్రమంలొ ఉటంకించేవారు. నేను అనుకునేది ఇది సరి అయిన సూక్తి అని.

  సాయిగణెషు

 10. subhadra Says:

  సర్వే జనా సుజనోభవంతు.. సర్వే సుజనా సుఖినో భవంతు.. అంటారు బాలు గారు.. నాకు అర్ధమైనంతవరకూ .. ప్రజలందరూ మంచివాళ్ళవాలి, ఆ మంచివాళ్ళందరూ సుఖంగా ఉండాలి అని.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: