తెలుగుబళ్ళు మూసుకుంటున్న ఉగాది

రెండేళ్ళ క్రితపు ఉగాదికి, “తెలుగు చచ్చిపోతే తప్పేంటి?” అని మొదలెట్టి,  అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఓ మాదిరిగా  “తెలుగులో ఆలోచించండి” అని చెప్పి వదిలాను. ఇంకా చాలా అన్నాన్లేండి. తెలుగు బ్లాగింగ్‌తో డబ్బెలా సంపాదించుకుందాం అని కూడా అనుకున్నాను.

ఐతే, పోయిన వారం ఈ-టివిలో, లీలగా ఓ వార్త కంటపడింది. It was very discomforting to see that news. So, i was unable to even search/talk about it with anybody else. ప్రభుత్వ బళ్ళలో ఇంగ్లీషు మీడియంని మొదటి తరగతి నుంచే మొదలేట్టాసారట.  తెలుగుమీడియంలో నమోదవుతున్న విద్యార్ధుల సంఖ్య సగానికి సగం పడిపోగా, అటు ఇంగ్లీషు మీడియంలో అంతే పెరుగుతోందిట. ఇలా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు రాకపోతే ఎట్టా అన్జెప్పి, ప్రభుత్వమే స్కూళ్ళన్నిటిని ఇంగ్లీషు మీడియంలోకి మార్చేస్తోందిట. ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత, తెలుగు పేపర్లు, తెలుగు సినిమాలు, పుస్తకాలు, తెలుగు ఛానెల్సూ అన్నీ మూసేసుకోవచ్చు. తెలుగుని వినియోగించుకునే మార్కెట్టు పెద్దగా ఉండదు గాబట్టి, గవర్నెమెంటిచ్చే ప్రకటనలకి కక్కుర్తి పడి వెయ్యి ప్రతులుతోనే తెలుగు దిన పత్రికలుగా చెలామణీ ఔతున్న కొన్ని వందల దినపత్రికల్లా, ఏవో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకోవచ్చు.

ఇప్పుడు వెతికి చూశాను. కాస్త కుదుట పడ్డాను. కానీ ఇప్పటికీ ఈ వార్త కొంచెం కలత చెందించేదే.
http://righttoeducation.in/media/andhra-pradesh-government-gives-english-push-primary-education-level

మొదట(పై పేరాలో) అనుకున్నట్టుగా మొత్తం ఇంగ్లీషు మీడియంకు మార్చటం లేదు. కేవలం ఇంగ్లీషుని సెకండ్ లాంగ్వేజ్‌గా, ప్రాథమిక స్థాయినించే, అంటే మొదటి తరగతి నుంచే నేర్పించటం ప్రారంభించనున్నారు. ఇంగ్లీషుకి ఇనిషియేట్ అవ్వటం వల్ల, అవకాశాలు అందుకోవటంలో కాస్త పరిస్థితి మెరుగ్గా ఉండవచ్చు. మంచిదే. కానీ, ప్రభుత్వ బళ్ళలో నమూదు సంఖ్య తగ్గిపోవటం, ఇంగ్లీషు బళ్ళకై ప్రజలు పరిగెట్టడం అనే అంశాలు అంత మంచి విషయాలు కాదు. ఇది ఇంకాస్త లోతుగా ఆలోచించి, పరిష్కారాలు కనుక్కోవలిసిన విషయాలు కదా.

ఏదైనాగానీ, ఏదో ప్రజలంతా ఒకటి కోరుకుంటున్నారు అన్జెప్పేసి, మనం దాన్ని ప్రోత్సహించం. సమాజానికి ఏది హితమో ఆలోచించి,, మేధావులు ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు…

జ్యోతిష్యం అనే పేరుతో మోసాలు చేసేస్తున్నారని జెప్పి, తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్యం కోర్సు బ్యాన్ చేసేయాలని ఉద్యమించారు కదా! ఏ?, ప్రజలు జ్యోతిష్యాన్ని ఇష్టపడ్డారుగా అని ఎందుకు వదిలేయటం లేదు?

ప్రజలు సెక్సు సినిమాలు చూడ్డానికి ఇష్టపడుతున్నారుగా అని, విచ్చలవిడిగా వాటిని ప్రదర్శించనియ్యడం లేదెందుకు? అరికట్టే మార్గాలు ఎందుకు తీసుకుంటున్నారు?? సినిమాలకి సెన్సారు బోర్డు ఎందుకు?

ప్రజలకి పైరేటెడ్ సినిమాలే ఇష్టంగా ఉన్నయ్ బయ్, మీ బిజినెస్ ఏమైతే మాకేంటి? ప్రజలు కోరుకున్నట్టు చెయ్యండని ఎందుకు అన్లేకపోతున్నాం?

చాలా అర్ధంపర్ధలేకుండా మాట్లాడుతున్నా కదూ!. యా…Anyway, the point i am trying to make is this:

ప్రజలు ఇంగ్లీషు కోరుకుంటున్నారు కదా అని మనం ఇంగ్లీషే నేర్పకూడదండి. ప్రజలు ఎందుకు ఇంగ్లీషుకి తరలి వెళ్తున్నారో తెలుసుకొని, ఆ అవసరాలు తెలుగులోసైతం తీరే మార్గం చూడాలి. తెలుగువల్ల అసమానతలు తగ్గగలిగే మార్గం చూడాలి. అంటే, ’తెలుగు చచ్చిపోకూడదు, తెలుగు భాషే మనకి తెలుగువారిగా గుర్తింపు నిస్తుంది. తెలుగువారనే గుర్తింపు ప్రజలకి అవసరం’ అని కొందరు మేధావులన్నా సరిగ్గా తెలుసుకోగలిగితే, వాళ్ళు తెలుగునీ, తెలుగు సమాజాన్ని నడిపిస్తారు. అంతేగానీ,  తెలుగులో పదాలు సృష్టించుకున్నంత మాత్రాన, తెలుగు బట్టగట్టదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? తెలుగు వల్లే అసమానత వచ్చే ప్రమాదం కనిపిస్తోంది!

మరో పెద్దమనిషి చెప్తారు – బోధనా పద్దతి మారిస్తే,  పిల్లలు తెలుగు నేర్చుకుంటారు అని. ఇప్పుడేమైంది? ఇదేనా తమరు కోరుకున్న బోధనా పద్దతిలో మార్పు?

మొదట్నించీ మీరందరూ చెప్తున్నదే నేనూ చెప్తున్నా.  భాష భావ వ్యక్తీకరణకే, తెలుగు వాళ్ళు మాట్టాడుకోవడం వల్ల తెలుగు ఉంటుంది. ఒకే! కానీ, తెలుగు వాడికి తెలుగులో మాట్టాడే అవసరం కూడా ఉండని పరిస్థితి వస్తే!? రాదు అనకండి.

ఈ మార్నింగ్ నేను వేక్ అప్ అయ్యాక, , జాగింగ్ చేసి, ఫ్లాట్ కెళ్ళి,  మిల్క్‌తో కార్న్ ఫ్లేక్సు తీసుకొని, యాక్స్ ఎఫెక్టుతో క్విక్ బాత్ చేసేసి, కారు డ్రైవ్ చేసుకుంటూ, ఆఫీసుకొచ్చేసరికి లేటయిపోయిందని మా లేడీబాస్ పెద్ద లెక్చరిచ్చింది. నేను లైట్ తీసుకునేవాడినే కానీ, ఈ సారి కొంచెం స్ట్రాంగ్ డోసివ్వడంతో , ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ ఐపోయి, కాఫీడేలో కూర్చొని, నా ల్యాప్ టాప్ తీసుకొని వర్క్ చేస్తుంటే, అది కాస్తా క్రాష్ అయ్యింది….

…..మన భాష ఇలాగే కంటిన్యూ ఐపోతుంది. ఇదంతా తెలుగే!  పైగా ఇలాంటి తెలుగు వాళ్ళకి విద్యార్ధి దశలో ఇంగీషునేర్పటం కోసం, చేతన్ భగత్ రైట్ చేసిన బుక్స్‌ని , గవర్నెమెంటు ఫ్రీగా ఇచ్చేట్టు ఎరేంజ్ చేద్దాం. ఏమంటారు!?

ఇదంతా తప్పండి. చివరికి ఏ ఊరి జనాలవల్ల  తెలుగు బతికేస్తుందని ఢంకా బజాయించి చెప్పారో, ఆ ఊళ్ళో జనాలకీ ఇది తిండి పెట్టకపోతే, వాళ్ళూ ఇంగ్లీషులోనే ఏరుకుంటారు.

పోనీ వేరేలా మార్చి చెప్పుకుందాం. తెలుగు ’వాడకం’ వల్ల తెలుగు ఉంటుంది. మరి ఎందుకు తెలుగు వాడకం పెరుగుతుంది? డబ్బొస్తే పెరుగుతుంది. అది నిజమే కావచ్చు. కానీ, డబ్బెలా పుడుతుంది? ఐడియాల వల్ల పుడుతుంది.  సరే ఈ కనెక్శన్ కూడా ఇప్పుడు సరిగ్గా కుదరదు. మరొక్కసారి ప్రయత్నిస్తాను.

తెలుగు వాడకం ఎలా పెరుగుతుంది? తెలుగులో కూడా అన్ని విషయాలు దొరుకుతాయన్న ’నమ్మకం’ వల్ల పెరుగుతుంది. నమ్మకమే కాదు – అన్ని విషయాలు దొరకడం వల్లే పెరుగుతుంది. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, విషయసేకరణ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, వార్తలు కావచ్చు, పత్రికలు కావచ్చు, నవళ్ళు కావచ్చు, శాస్త్ర దృక్పదాలు కావచ్చు, సేవలు కావచ్చు… ఏదైనాగానీ, తెలుగులో విషయం దొరుకుతుంది అన్న స్థితిని కల్పిస్తే, ’ఇంగ్లీషుకి వెళ్తేగానీ మనుగడ లేద’న్న భయాన్ని/స్థితిని తొలగిస్తే, అప్పుడు ప్రజల్లో తెలుగు వాడకం నిలుస్తుంది/ పెరుగు తుంది.

దీనికి ప్రభుత్వమేదో చెయ్యలన్న దానికన్నా, మనం తెలుగువాళ్ళుగా ఏం చేసుకున్నాం అన్నది పెద్ద ప్రశ్న. ఉదా: దివాకర్ బస్సు సర్వీసు సైటు చూడండి. వీడు తెలుగు వాడేనేమో! ఉగాది శుభాకాంక్షలు అని మాత్రం తెలుగులో పెట్టాడు. ఈ సైటువాడు, తన బుకింగ్ సర్వీసుని ఇండియాలో అన్ని చోట్లా ఇస్తాడు గాబట్టి,దాన్ని ఇంగ్లీషులోనే పెట్టుకుంటాడు. కానీ, కనీసం తెలుగువారికై, తెలుగులో ఆప్షన్స్ చూపించడం వల్ల, తెలుగు నేర్చుకున్న పిల్లవాడికి సైతం దీని వాడటం వచ్చేసి, కొంతలో కొంత ఓ ఉద్యోగ అవకాశం వస్తుంది. Ofcourse, I am also aware that  ఇది ఏ భాషలో ఉన్నా, ఆ పిల్లవాడు నిరక్ష్యరాస్యుడైనా, ఒకసారి నేర్పితే అల్లుకుపోయే పిల్లవాడైతే, వాడు భాషతో సంబంధంలేకుండా పని చేసుకుపోతాడు. కాబట్టి, ఈ ఒక్క ఐడియా పట్టుకొని, నా పీకనొక్కద్దు. Get the general idea. మనం ఇచ్చే అన్ని సర్వీసులనీ, ఏదో విధంగా తెలుగులో చూపించే ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎన్విరాన్మెంటులో మార్పు వస్తుంది.

కానీ ఒక్కసారి మనం ఇంగ్లీషులోకి అలవాటుపడ్డ తర్వాత, మళ్ళా వాటిని తిరిగి తెలుగులో చేయించడం, బ్రహ్మతరం కూడా కాదు. That would be going  retro. You might be even seen as a fanatic then!.

ఇంకా బ్రాడ్‌గా చెప్తే, తెలుగులో ఆలోచనలు సాగాలి. దానివల్ల, తెలుగు వాడకం నిలుస్తుంది. ఇవ్వాళ్టికి ఇంతటితో ఆపేస్తాను. మళ్ళా రేపో మాపో మళ్ళీ వస్తాను.

కానీ ఇలా తెలుగుని చావనివ్వకండి ప్లీజ్. ఛస్తే ఏ? అంటే, నిజానికి ఏమీ లేదు. నేను మీలాగే అవకాశవాదినే. ఇంకేదో అవకాశం చూసుకొని ముందుకెళతానేగానీ, దీన్ని కాపాడుతూ చచ్చిపోను. నేను బతకటం ఇంకా ముఖ్యం.

అన్నట్టు, తెలుగు భాషకీ,  ఉగాదికీ సంబధం లేదేమో. తెలుగువారేకాదు, ఎక్కువమంది కన్నడిగులు కూడా, చాంద్రమానాన్ని వాడుకుంటారు. ఇది అలా ఓ సంవత్సరాది. ఊరకనే, జనవరి ఫస్టుకి భిన్నంగా ఉండటం కోసం, దీన్నితెలుగు సంవత్సరాది అన్నాం. [తెలంగాణా సంవత్సరాది అని ఇంకోటి తయారు చేసుకోనక్కర్లేదనుకుంటాను. ఇది కన్నడ సంవత్సరాది కూడా. మళ్ళీ అందులోనూ, మాంగళూర్ ప్రాంత ప్రజల్లో సౌరమానం ఎక్కువ వాడుకలో ఉండటం కద్దు. వాళ్ళు ఏప్రెల్ 14గో ఎప్పుడో చేసుకుంటారట]

ఉగాది శుభాకాంక్షలతో

మీ

రేరాజ్

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

2 వ్యాఖ్యలు పై “తెలుగుబళ్ళు మూసుకుంటున్న ఉగాది”

  1. SRRao Says:

    మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    – శి. రా. రావు
    ఉగాది ఊసులు
    http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: