పప్పా పాట పాడనా

పప్పా పాట పాడనా
మమ్మీ మాటడనా
అన్న ఆటడనా
చెల్లీ కథ చెప్పనా      ||పప్పా||

నా మాటే ఒక  పాటా
నా పాటే పూలతోట

నా ఆటే మెరుపుల వేట
నా కథే ముద్దుల మూట||౨|| ||పప్పా||

అమ్మ నాన్న పల్లవీ
అన్న చెల్లీ చరణాలూ

నేనే ఈ పాటకి రాగం
దీని భావం అనురాగం ||౨|| ||పప్పా||

P.S. Pure Nostalgia. అంతే కానీ, తరిగిపోతున్న అనురాగ బంధాలు, మరుగున పడ్డ నులక మంచం, కాలిపోయిన కుంపటి, పాచిపోయిన పూతరేకు, తగలడుతున్న తెలుగు లాంటి భావాలు నాకు లెవ్వు. భాషాభిమానం ఉంది. కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటివల్ల, పిచ్చి వాగుడి వల్ల తెలుగు నిలవదు. కొంగొత్త ’భావ’వ్యక్తీకరణ వల్ల భాష జీవిస్తూ ఉంటుంది. అది నా నమ్మకం. ఈ బోడి పాట మర్చిపోయినంత మాత్రాన కొంపలేమీ అంటుకుపోవు. మరైతే ఎందుకు రాశారు సార్ అంటారా, దానికి నా సమాధానం ’ప్యూర్ నాస్టాల్జియా’. చాలా ఏళ్ళ క్రితం ఈ పాట రేడియోలో వచ్చేది. కనీసం మా ఇళ్ళల్లో ఎవరో ఒకరు పాడుతూ ఉండేవారు. ఇన్నేళ్ళ తర్వాత, సడన్‌గా గుర్తుకొచ్చి పాడుకున్నాం. మీతో పంచుకున్నాం. పాటొస్తే, మీరూ హమ్ చేసుకోండి.

అబ్బా…. ఔనండి..’హమ్ చేసుకోవడం’ తెలుగులో ఇంకెలా చెప్తారో నాకు తెలీదు. నే హమ్ చేసుకుంటూ వెళ్తున్నా. సి యూ.. బై.
నా మాటే ఒక  పాటా..అ…ఆ…ఆ…….
నా పాటే పూలతోట..

నా ఆటే మెరుపుల వేట
నా కథే ముద్దుల మూట||౨|| ||పప్పా||

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: