ద్వైతం – విశిష్టాద్వైతం – అద్వైతం

సమర్పింపబడినది ఫిబ్రవరి 21, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

న్యూజింగ్స్ మనోహర్ కామెంటు వల్ల, బ్లాగ్లోకుల్లో అద్వైతంపై అవగాహన సరిగా లేదన్న అభిప్రాయం/అపోహ నాలో కలిగాయి. మనోహర్‌కి ఏమీ తెలీదని కాదు. ఎంతో కొంత తెలుసన్న అంచనా/ఆశలతోనే, ఆ అభిప్రాయం కలిగింది. కొంత మేరకు క్లారిటీని పెంచాలనీ, ఈ తరంలో కొందరికి ఆసక్తి కలిగించాలనే డైరెక్టుగా అద్వైతం అంటూ రాశాను. నేను ఆసక్తి కలిగించే ఈ విధానం అందరికీ రుచించదు. ఐతే, ఏదో “మనం దీన్ని గౌరవించాలి కదా” అన్నభావనతో ఉంటే, విషయం రొడ్డుకొట్టుడుగా మారుతోందే తప్ప, ప్రాక్టికల్ సిగ్నిఫికన్సు ఏమీ మిగలదు. [అందుకే మనోహర్‌ని  ’చిలకపలకుల మనోహర్’ అని పిలుచుకుంటున్నాను]

ఐతే, ’శ్రీ’ అనే వ్యాఖ్యాత సరిగ్గా ఇలాగే నా గురించి భావించారు. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పి, రిఫరెన్సెస్ ఇచ్చి, సెలవు తీసుకున్నారు. అందులో కొన్ని పేర్లు నేను ముందు విన్నవి. ఆసక్తి లేనివి కొన్ని, ఉన్నవి కొన్ని. దీనివల్ల, ఆ ఆసక్తి ఉన్నవిషయాలని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాననే నేనుకుంటాను. వారి ఉద్దేశ్యం కూడా అదే అయి ఉంటుంది. 

అలాగే, నా బ్లాగు పాఠకులైనా కదా!
————————————————-

I am highly skeptical about these out-of-body experiences. But i can not rule out such possibilities. It is claimed that its beyond the intellectual plane. Fine! In such case, it interests me only to a point of intellectual understanding. But, why I am not ruling it out? That’s a subject matter on its own and there is lot of intellectulising about it too. ఈ పేరా తెలుగులో చెప్పటం రాలేదు.అనువదించే ఓపిక, సమయం లేవు.

ఏదేమైనప్పటికీ, ఈ విషయాల మీద కొంత అవగాహన కలిగి ఉండటం మంచిది. మనని ఫనెటిక్స్‌గా తయారు చెయ్యకుండా దోహద పడగలదు. [మనం ఫనెటిక్స్ ఎందుకు అవ్వకూడదూ? అవ్వచ్చు. కొందరు ఔతారు. అదీ నిజమే. కానీ కొందరు అందులోనించీ బయట పడతారు.]

మొన్నోసారి చెప్పుకున్నట్టు, సమాజం మారాలి అని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ ఏ దిశలో మారాలి? ఎలా మారాలి? అది ఎలా ఉండాలి? అన్న విషయాల మీద అందరం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. అసలు రాలేం కూడానేమో. ఐతే, కొంత అద్వైత రచనల్లో – ’మార్పుని సాధించటం అనేది ఏమీ లేదు’ – అనే ధోరణి ఉంటుంది. అదీ నిజమేననిపించే సన్నివేశాలు కూడా మనకు జీవితంలో తారసిల్లుతుంటాయి. కానీ, ఇక్కడే ఓ పారడాక్స్ ఉంది. అదే నిజమైతే, శంకరుడు మనకి ఇంత రెవల్యూషనరీగా ఉండడు. ’ఆయన కృపేగా ఇది’ అని అనిపించుకొనే కార్యాలేవి చేసి ఉండడు. కానీ, ఆయన చేశాడు. మార్పు సాధించాడు! సరిగ్గా గమనిస్తే, the same thing is at work everywhere. శంకరుడికి ముందు, బుద్దుడు కూడా అలాగే మార్పు సాధించాడు. [శంకరులు బుద్దుడూ మార్పు సాధించారా?లేక వాళ్ళ తదనంతరం జనాలు సాధించారా?ఇంకేమన్నా జరిగిందా? లాంటి చారిత్రక ప్రశ్నల మీద కూడా ఆలోచించవచ్చు. కానీ ఇప్పటి నా పాయింటు అది కాదు.  ఇతిమిద్ధంగా వీళ్ళే ఆ మార్పు సాధించారు అని చెప్పుకున్నా, వీళ్ళవల్ల మార్పుకు మార్గం సులభమయిందని రాసుకున్నా, విషయం ఒకటే నన్న ఓ అవగాహన ఉండటం అవసరం.] అప్పటి శంకరుడు వాదించాడన్నా, బుద్దుడు వాదించాడన్నా, సోక్రటీస్ వాదించాడన్నా – అందరిలో కనీసం మార్పు కోసం వారు చేసిన “వాదన” / “ఆలోచన” అన్న ఏకత్వమైనా మనం దర్శిస్తాం కదా!

డిస్పాషనేట్‌గా చూస్తే, ఎన్నో కారణాలు కలిసి రావడం వల్లో, అదృష్టంవల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు కనిపిస్తుంది. డిస్పాషనేట్ అని ఎందుకంటున్నాను? కొందరికి గాంధీ వల్లే స్వాతంత్ర్యం వచ్చినట్టు ఉంటే, కొందరికి కాంగ్రెస్ వల్లే సాధ్యమయ్యింది అనిపిస్తుంది. మరికొందరికి, కాంగ్రెస్‌లో దాక్కున్న కమ్యునిజం వల్లే ననిపిస్తే, మరికొందరికి ఆజాద్ హింద్ ఫౌజ్ వల్లే వచ్చిందనిపిస్తుంది. ఇంకో పిట్టకథలో, కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులైన హ్యూమ్స్‌‌కి, భారతీయ ఋషుల అతీంద్రియ శక్తుల మీద నమ్మకం ఉంది. అలాంటి ఋషుల ప్రోద్బలం వల్లే కాంగ్రెస్‌ని ఏర్పాటు చేశాడు. అది నమ్మితే, కాశ్మీరులో ఇప్పటికీ కనిపించకుండా తిరుగాడే, అతీంద్రియ శక్తులున్న సన్యాసులవల్లే, మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు! లేక – హ్యూమ్స్ ముఖాన్ని ముందుకి చూపిస్తూ, బ్రిటీష్ ప్రభుత్వం నుంచి డైరెక్టు యాక్షన్ తప్పించుకొని, కాంగ్రెస్‌ని మనగలిగేలా చెయ్యాలన్న మేధావుల వల్లే, కాంగ్రెస్ పుట్టి, స్వాతంత్ర్యం సమరంలో ముఖ్య భూమిక నిర్వహించి ఉండొచ్చు. ఏ ఒక్క కారణాన్నో పట్టుకొని, దానివల్లే జరిగిందని ఎలా చెప్పగలరు చెప్పండి? దీనికి పూర్తి యాంటీగా, అసలు బ్రిటీషు ప్రభుత్వమే కుట్రతో కాంగ్రెస్‌ను పుట్టించింది అని వాదించిన వారూ ఉన్నారు – రాజకీయంగా, కాంగ్రెస్‌పై బురదజల్లవలసి వచ్చినరోజు! సో, డిస్పాషనేట్‌గా అంటే? ఏ ఒక్కదానిమీదో రాగం పెంచుకోకుండా, దేని మీద ద్వేషం పెంచుకోకుండా, సమదృష్టి కలిగి అని. Is that familiar language to you now? కానీ, ఇది పూర్తిగా బాహ్యజగత్తుకు సంబంధించిన విషయమే. ఇందులో, ఎటువంటి మిస్టికల్ విషయమూ లేదు. ఔనా?

పడిగట్టుపదాలుగా, చిలకపలుకలుగా మనం మాట్లాడటం దండగ. దండగంటే? చిలకపలుకులు పలుకుతున్న వ్యక్తికి, ఆ పలుకులతో ఏమీ ఒరగదు. కానీ, in a grand scheme of things, perhaps, even those words are ‘working’. Who knows?

దేశాన్ని, దేశభక్తిని తయారుచేస్తారు. ఆ అవసరం ఎవరిది? వారెందుకు తయారు చేస్తారు? 
ఉదా: కేసియార్ తెలంగాణాని ఎందుకు తయారు చేస్తున్నట్టు? కెసియారు తయారు చేస్తే తెలంగాణా వస్తోందా? లేక తెలంగాణ ముందు నుంచి ఉన్నదేనా?. ఓ తెలంగాణ తల్లీ, ఓ తెలంగాణ సంస్కృతి అంటూ కొన్ని సింబల్స్ తయారు చేస్తున్నట్టుగానే, దేశమాత, దేశసంస్కృతి తయారైనాయా? లేక అలాంటి విషయం అసలు ముందు నుంచే ఉందా? ఇవన్నీ అసంబద్దమైన విషయాలు కాదు. Look at the symbols. మనం ఈ “దేశం” అన్న భావనని పెంపొందిచటానికి, ఓ జెండా, ఓ ఎంబ్లం, ఓ జాతీయ గేయం, ఇలా తయారు చేసుకున్నాం. సరిగ్గా, తెలంగాణ రాజకీయలకై,  మన ముందు అలాగే తయారౌతున్నట్టుగానూ, కనీసం కొందరం గుర్తిస్తున్నాం. తెలుగు తల్లితో సంబంధం లేకుండా, తెలంగాణా తల్లిని ప్రార్ధించవలసి వచ్చినా/ లేక ద్వేషించవలసి వచ్చినా, మన భావావేశాల్లో మార్పుని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ, సింబల్స్ యొక్క అవసరమూ, అవి సృష్టించే విభజనా రెండూ ఒకేసారి అర్ధం చేసుకోటానికి ఈ ఉదాహరణ ఉపయోగిస్తుందని ఆశిస్తున్నాను. ఇదే రకంగా, అన్ని రకాల సింబల్స్‌ని పిడిదెబ్బలతో  పిండి పిండి చేస్తే, ఆ సింబల్స్ యొక్క అవసరమూ, అడ్డంకీ రెండూ అర్ధమౌతాయి. ద్వంద్వం నశించికుండానే నశించి – ఏకత్వం దర్శనమిస్తుంది. అప్పుడు సింబల్స్‌తో పనేంటి మీకు?

ఎనివే, ఇవ్వాళ శీర్షికలోని విషయం చాలా క్లుప్తంగా  చెబ్దామనుకొని కూడా చాలానే రాశాను. ఈ క్లుప్తమైన వివరణ, ఓ పురాణశ్రవణంలో చెప్పగా విన్నాను. నాకు నచ్చింది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజిలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన(చేస్తున్న!?)  ” టికేవి రాఘవన్” అనే ఆయన ఇలా చెప్పారు:

ద్వైతం అంటే? – భగవంతుడు, భక్తుడూ విడివిడిగా ఉండటం.
తల్లి దగ్గర కూర్చొని ఆడుకుంటున్న పిల్లాడిలాగా.

విశిష్టాద్వైతం అంటే? – భగవంతుడులోనే రమించే భక్తుడు విడిగా ఉండటం.
తల్లి గర్భంలోనే ఉన్న శిశువు, విడిగా ఉంటూనే, తల్లిలోనే ఉన్నట్టుగా.

అద్వైతం అంటే? – “భగవంతుడు-భక్తుడు” అన్న సెపరేషన్ పోయి, ఒకటైపోవటం.
తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడు, తల్లికంటే భిన్నంగా ఉన్నట్టు కాదుగా.

ఇవ్వాళ్టికి ఇంతే నండి నా కోతిగీత 🙂 – If you enjoyed, do let me know. Your appreciation certainly makes me happy too 🙂

ప్రకటనలు

శృంగేరిలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

సమర్పింపబడినది ఫిబ్రవరి 18, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

“We eat food always. Its just the food form that keeps changing” – Jayesh K Gopalan
_________________________________________________________________________

ఇది ఓ చరిత్రాత్మక సంఘటనట!666 సంవత్సరాల తర్వాత జరిగిందిట!

శృంగేరిలో ఓ గుడి కట్టి, మొన్న 16.02.2011న,  ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అసలు ఈ ప్రాంగణంలో ఇదువరకు ఓ ఆలయనిర్మాణం జరిగి, ఆరువందల సంవత్సరాలయ్యింది ట! అప్పటిలాగానే  పునర్వసు నక్షత్రంలో, మాఘ శుక్ల ద్వాదశినాడే ఈ పతిష్టాపన జరగాలని అనుకున్నాగానీ, అది మంగళవారం అవ్వటంతో, త్రయోదశి- బుధవారంనాడు చేశామని జగద్గురువులు అన్నారు.(ఇక్కడ నా తోక కామెంటు ఒకటి – ఈ రోజు ’మిలాద్-ఉన్-నబీ’ కూడా మరి! మనలో చాలా మందిమి హాలిడే అనుభవించిన పర్వదినం)

గౌరిశంకర్ ట- ఈ ప్రాజెక్టు నెత్తినేసుకొని చేసిన వ్యక్తి పేరు. శిల్పి పేరులో ఏదో శంకర్ ఉందిట! చివరికి ఆలయ శిఖరం మోసుకొచ్చిన క్రేన్ కంపెనీ, చెక్కిన స్టోన్ ఫ్యాక్టరీ అన్నీ శంకర్ పేరే కలిగి ఉండటం కాకతాళీయమే,  భగవత్సంకల్పమేనంటారు ఈ గౌరీ శంకర్. నాకు మాత్రం, ’తెలిసో తెలీకో తమరే అలాంటి నిర్ణయాలు తీసుకోనికూడా ఉండొచ్చు మహానుభావా’ అనిపించింది. సదరు మనిషి ఉపన్యాసంలో అంటారు – నేడు మనం అనుసరిస్తున్న మన సనాతన ధర్మం ఈ విధంగానైనా ఉండటం ఆదిశంకరుల కృపే కదా! అలాంటి అవతరారమూర్తికి ఊరూరా ఓ ఆలయం ఉండవలసింది కానీ, అలా జరగలేదోంటో కదా అని!? అంటే సనాతన ధర్మం అనేది ఒకానొక మతం అని వారి ఉద్దేశ్యం. నాకు చిరాకేసింది. కానీ ఏమి చెయ్యగలం!?

జగద్గురువులు ఉపన్యసించారు. గౌరి శంకర్ చెప్పినట్టు, ఎందరో సహకారం వల్ల ఆలయనిర్మాణం జరిగింది కానీ, అది తన ప్రభావం వల్ల కాదని, ఆయా వ్యక్తులకు అద్వైత సిద్దాంతం మీద ఉన్న నమ్మకం వల్ల అలా సహకరించారని చెప్పారు. తాను ఈ కార్యానికి నిమ్మిత్త మాత్రంగా ఇక్కడ కూర్చోవడం తన భాగ్యం! అంతే! నన్నారు. ఆలయం ఉంటే బావుంటుందనేది తమ సంకల్పం అని చెప్పినా,  ఒక వేళ అది నిర్మించకపోయినా వారు పెద్దగా విచలితమయ్యేదీ లేదన్నట్టు –  నా కర్ధమైన వారి భారీ సంస్కృతకన్నడం[ జగద్గురువులు దక్షిణ భారత భాషలన్నీ మాట్లాడగలరుట; బైదివే, ఆయన ఆరిజన్ తెలుగే! తెలుసా? 🙂 ]  ప్రాజెక్టు ఐడియా కిందటి జగద్గురువుకే ఉన్నట్టు కూడా అర్ధమయ్యింది – గౌరి శంకర్ ఉపన్యాసంలోనో ఎక్కడో.ఏమైనా, ఈ నాన్- ఎటాచ్డ్ యాటిట్యూడ్, నాకు సత్వం లాగా కంటే, తామసం లాగానే గోచరిస్తోంది మరేంటో.

కేరళలో పుట్టిన శంకరులు, తన చోటుని వదిలి వెళ్ళి,  ఆమ్నాయ పీఠాలను శృంగేరిలోనూ, పూరీలోనూ, బదరీలోనూ ద్వారకలోనూ నిర్మించి, తన గొప్పతనాన్ని చూపించారు. In other words, గొప్ప నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించారని భావం! నిజమే, ఒక్క చోట కూడా, స్థానిక వ్యక్తులని పీఠాధిపతులను చేయలేదాయన. కానీ, నా బాధేంటంటే, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ సాధించాల్సిన నేటి జగద్గురువులు, అంత చేసిన ఆయనకి గుడి కట్టేసి చాలా స్థానికమూ పరిమితమూ ఐపోయేరేంటని!? ట్రాన్సిడెంటల్ యోగాలు, సమాధిలు సాధించే వారికి, కర్తవ్యమేలేని సన్యాసికి మతాన్ని రక్షించడమే జ్ఞానమెందుకయ్యింది? కర్తవ్యమెందుకయ్యింది? ఏమీ పాలుపోలేదు. ఐనా పాలుపోతే ఏంటీ, పెరుగైతే ఏంటీ? – అద్వైతాన్ని రక్షించడం ఏంటి? నాశనమవ్వడం ఏంటి!? అంతా మాయ! నల్లకుంట అమ్మవారి దగ్గరే, ఈ మాయలో ఇంతకన్నా ఎక్కువ ఆనందించిచనట్టుగా నాకు అనిపించింది.

జగద్గురువులగారి non-attached సంకల్పంలాగానే, నాకు ఈ మధ్యే ఓ కోరిక పుట్టింది మొన్న(చూసే ఉంటారుగా!) ఏమో! కెసీయారుగారి డివిజివ్ పాలిటిక్స్‌నే గాంధీ రాజకీయం అనుకునే రోజులొచ్చాయి. నా యూనిఫైడ్ రిలిజియాసిటీ వల్ల, నేనే ఓ అద్వైత సిద్ధాంత బహు మత సంస్థాపక, ఆలయం, భువనాలయం ఐపోతేనేమో? ఎవడికి తెలుసు!

నాకిదినచ్చలేదన్నాను నా కొలీగ్ జయేష్‌తో. “సనాతన ధర్మం నాశనమవ్వటం ఉండదు. ఎప్పటికి ఉండేదొకటి ఉంది. అదే ఇన్ని రూపాల్లోకీ, కొత్త రూపాల్లోకీ మారుతూ ఉంటుంది.”

అప్పుడు కొలీగ్ జయేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది: “We eat food always. Its just the food form that keeps changing”

“అద్దరగొట్టేశావ్ కదా! నిజం.
మన ఉద్యోగంలో అలా కొత్తరూపాన్ని సంతరించుకోలేక, ఈ జీవితం మీద విరక్తి పుట్టి నేను సన్యాసినవుతానేమో అని  నువ్వు భయపడ్డావు. కానీ, ఇక్కడ ఏ నవ్యత్వం లేక, అదే పాత సరుకుని ’సనాతనం’ అన్ని అమ్మజూస్తుంటే, నాకు దీని మీద కూడా విరక్తి పుట్టింది. ఏంటో!” అన్నాను.

జయేష్ రిప్లై ఇది: “సన్యాసం మీద కూడా విరక్తి పుట్టిందంటే, అదే నిజమైన వైరాగ్యం”.

We broke into a loud laugther.

oh ya! Sankara breaks me free! even from this!
______________________________

శృంగేరి సైటు : www.sringeri.net

ఛాయారాజ్ ’కుంతి’ via కొత్తపాళీగారి ’టపా’

సమర్పింపబడినది ఫిబ్రవరి 2, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

ఛాయారాజ్ అనేవారి ’కుంతి’ అనే కవితనిచ్చి,  ఇది కవితా? ఐతే ఎందుకు? కాకపోతే ఎందుకు? అంటూ కొత్తపాళీగారు ఓ ’టపా’ వేశారు. కామెంటు పెద్దదవ్వటంతో, as usual, నా బ్లాగులోనే  ’పోస్ట్’ చేస్తున్నాను.

రేరాజ్ కూడా కవితలు రాస్తారుగానీ  ఎవరూ చదవరు.  ఆ కవిత ఏదన్నా ఇచ్చుంటే ఏది కవిత్వం కాదో బాగా తెలిసేదేమో 🙂 .  సరే, ముందు  ’కుంతి ’ కవితను చూడండి. Read the rest of this post »

“ఇకడెవ్వరూ ఎవ్వరిని కలుపుకోలేదు …***య్ బే”

సమర్పింపబడినది జనవరి 28, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

’ సీరియస్ ఎమోషన్ లేకుండా ఫైటింగ్ చెయ్యలేన్రా” – ఇదేనా  రవితేజ డైలాగు? నా పరిస్థితీ అదే. గ్యాప్ వచ్చేసింది. ఎమోషన్ ఎగిరి పోయింది. పైగా మనోహర్‌కి చాన్స్ ఇచ్చినా,  సాలిడ్ పాయింట్లతో రాలేదు. Read the rest of this post »

“తిరుగులేని దేవుడు తిరుమలరాయడు”

సమర్పింపబడినది జనవరి 19, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

వ్యాఖ్యల కంటిన్యూషన్లో :

@Mohd Javed:
Thank you. The point is well made in just one line. great ! Read the rest of this post »

అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?

సమర్పింపబడినది జనవరి 17, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

“అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?”.  

చెవిపోగులు, నుదుటిన బొట్టు పెట్టుకున్న ఆ ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు, అసందర్భంగా నే వేసిన ప్రశ్నకి సెకనులో వెయ్యోవంతు కాలం తత్తరపడ్డాడు. Read the rest of this post »

రేప్ చేసి, ఓ నిజం తెలుసుకుందాం

సమర్పింపబడినది జనవరి 12, 2011 ద్వారా rayraj
వర్గాలు Uncategorized

కొన్నాళ్ళ క్రితం Read the rest of this post »